ముగిసిన విశ్వ క్రీడా సంరంభం!

విశ్వ క్రీడా సంగ్రామం ముగిసింది. రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించిన టోక్యో ఒలింపిక్స్​ ముంగిపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బాణసంచా వెలుగులు పాప్ సంగీతం, సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారత్ నుంచి 10 మంది అథ్లెట్లు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక టోక్యో ఒలంపిక్స్ అద్భుతాలే కాదు ఎన్నో ప్రత్యేకతలతో పాటు సంచలనానికి కేంద్ర బిందువు అయింది. చైనా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు తమకు తిరుగులేదని మరోసారి చాటిచెప్పాయి. 38 గోల్డ్ మెడల్ తో చైనా టాప్ లో నిలువగా.. ఆ తర్వాతి స్థానంలో అమెరికా 36 గోల్డ్మెడల్ ఇస్తూ రెండో స్థానంలో నిలిచింది. జపాన్ 27 పసిడి పథకాలతో మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 17 బంగారు పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

కాగా విశ్వ క్రీడల్లో భారత అథ్లెట్లు విజయ బావుటా ఎగురవేసి ఘనమైన ముగింపు ఇచ్చారు. భారత్​ ఎన్నడూ లేని విధంగా ఏడు పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) ముగింపు నిచ్చింది. అంతకుముందు అత్యధికంగా లండన్​ ఒలింపిక్స్​లో (2012) 6 పతకాలొచ్చాయి. భారత్ ఒలంపిక్స్ చరిత్ర లో సరికొత్త అధ్యాయానికి తెర తీస్తూ నీరజ్ చోప్రా అద్భుతాన్ని సృష్టించాడు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్ లో తొలి బంగారు పతకాన్ని సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.