ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు ఎన్డీయే వర్గాలు చెబుతున్నా.. పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఐఏఎన్‌ఎస్–సి ఓటరు సర్వే నిర్వహించింది. సర్వేలో 52 శాతం మంది మళ్లీ యోగిదే యూపీ సీఎం పదవిని అభిప్రాయ పడితే.. 37% మంది మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని వెల్లడైంది.
ఇక కరోనాను ఎదుర్కోవడంలో సీఎం యోగీ విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఆయన ఊరటనిచ్చాయని చెప్పాలి. పంచాయతీ ఎన్నికల్లో 75 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలవడంతో యోగి ఆదిత్యనాథ్ విమర్శలకు చెక్ పెట్టారు.
కాగా మోడీ 2.0 కొత్త కేబినెట్‌లో ఉత్తరప్రదేశ్ కు చెందిన నేతలకు పలువురు ముఖ్య నేతలకు క్యాబినెట్ పదవులు దక్కడంతో.. సమీకరణాలు మరింతగా మారే ఛాన్స్ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కొత్త క్యాబినెట్ తో పరిస్థితులు మెరుగవుతాయని సర్వేలో 46% మంది అభిప్రాయపడితే.. 41% మంది పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఐఎఎన్‌ఎస్–సీ ఓటరు సర్వే మొత్తం 1,200 మంది ఇంటర్వ్యూలు ఆధారంగా వివరాలను వెల్లడించింది