కత్తి మహేష్ మరణం పై ట్రోల్స్ ఎందుకు..?

మనిషి బ్రతికి ఉన్నప్పుడు కన్నా మరణించినప్పుడు అతని విలువ తెలుస్తుంది అని యోక్తి. ఎందుకంటే మనిషి బ్రతికున్నంత కాలం అతని ప్రవర్తన నడవడిక ఏంటన్నది.. మరణించాక అతనికి సమాజం ఇచ్చే గౌరవం బట్టి తెలుస్తుంది. కాగా సినీ విశ్లేషకుడు, జర్నలిస్ట్ కత్తి మహేష్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. అతని మరణానికి సానుభూతి ప్రకటించడం పోయి.. మరణం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం చూస్తుంటే.. అతని మంచి కన్నా చెడు కోరుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా బతికున్నంత కాలం తన టాలెంట్ తో కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిచిచాడు కత్తి మహేష్. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. దీంతో అతని అభిమానులతో పాట సన్నిహితులు.. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అతని మరణానికి సానుభూతి ప్రకటించడం పోయి.. అతని మరణం పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది . దీనికి గల కారణం అందరికి తెలిసిందే.
కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్యలో సోషల్ వార్ చాలా రోజుల పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నడిచింది. పవన్ కళ్యాణ్ పై నిత్యం విమర్శలు చేస్తూ ఫ్యాన్స్ తో గొడవ పడుతుండేవాడు కత్తి మహేష్. ఇక కొన్ని సందర్భాల్లో పవన్ అభిమానులను రెచ్చగొట్టడం పనిగా పెట్టుకొని సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే అనుకోకుండా కత్తి మహేష్ అకాల మృతి చెందినా.. కత్తి మహేష్ పై కొందరు ఫ్యాన్స్ ఇంకా నెగిటీవ్ ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ మానవత్వంతో స్పదిస్తుంటే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం కత్తి మహేష్ మృతిపై తమ దూషణల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
కత్తి మహేష్ మరణ వార్త తెలుసుకున్న కొందరు ఫ్యాన్స్ లాఫింగ్ ఎమోజీస్ పెడుతున్నారు. వినాశకాలే విపరీతబుద్దీ అంటూ తిల పురాణాన్ని వదులుతున్నారు. అయితే ఇక్కడ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఒకరకంగా ఉంటే మరికొందరి కామెంట్స్ ఇంకోరకంగా ఉన్నాయి. అప్పట్లో శ్రీ రాముడిపై కొన్ని వ్యతిరేక కామెంట్స్ చేసాడు కత్తి మహేష్. రాముడిని కించపరుస్తూ రావణాసురుడిని దేవుడిగా కీర్తించిన అప్పటి కత్తి మహేష్ వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. అనవసరంగా దేవుడి జోలికి వచ్చావు.. ఇప్పుడు ఆ దేవుడి వద్దకే వెళ్లిపోయావ్ అంటూ కొందరు అంటుంటే.. దైవ శక్తి ముందు దుష్ట శక్తి ఓడిపోయిన రోజు అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇలా కత్తి మహేష్ మృతిపట్ల ఎవరికీ వారే సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే ఇన్ని నెగిటీవ్ ట్రోలింగ్ మధ్యలోను కొందరు నెటిజన్స్ మానవత్వంతో కత్తి మహేష్ మృతికి సంతాపం తెలియజేయడం గమనార్హం. కత్తికి రెస్ట్ ఇన్ పీస్ అంటూ సానుభూతి తెలియజేస్తున్నారు. జరిగిందేదో జరిగింది… ఇంకా ఒక చనిపోయినా వ్యక్తిని తిట్టొద్దు.. అతని చావులో మన ఆనందాన్ని వెతకొద్దు అంటూ ట్రోలర్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా ఆక్సిడెంట్ తరు వువాత కత్తి మహేష్ ఆరోగ్యంగా తిరిగొస్తాడనుకున్న జనాలు కత్తి మహేష్ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.