పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న నటిస్తున్న చిత్రం వకిల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. శ్రుతి హసన్, నివేద థామస్, అనన్య , అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘కంటిపాప కంటిపాప’ మెలోడీ గీతాన్ని చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్, దీపు, తమన్ ఆలపించారు.
హిందీలో విజయవంతమైన ‘పింక్’ రీమేక్‌గా చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’ పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆకాశం గొడుగు నీడ
పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండా
ప్రేమే మన కోటగోడ ❤️
ఎదలో ఏకాంతము
ఏమయ్యిందో ఏమిటో
ఇదిగో నీ రాకతో
వెళిపోయింది ఎటో
కంటిపాపా కంటిపాపా
చెప్పనైనలేదే
నువ్వంతలా అలా
ఎన్ని కలలు కన్నా…
https://t.co/pAJacCQ7Ak
#SriramVenu #MusicThaman #ArmaanMalik22 #SVCCofficial