Valentine’sday: మిర్చిలో ‘ వాలంటైన్ వీక్’ ప్రత్యేక షోలు.. ఎక్స్ ట్రా లవ్..!

Radiomirchi :  ఫిబ్రవరి, ఓ ప్రేమ మాసం. ప్రేమికుల మాసం. బంధాలను, అనుబంధాలను చిగురింపజేసే మాసం. వయసుతో సంబంధం లేకుండా మనసులోని ప్రేమను గుర్తుకుతెచ్చే మాసం. ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రేమ సముద్రంలాంటింది. అలాంటి మహా సముద్రాన్ని అన్వేషించడానికి..  సెలబ్రేట్ చేయడానికి మిర్చి తెలుగు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దానిపేరే ‘మిర్చి ఎక్స్ ట్రా లవ్’. వాలైంటయిన్ వీక్ సందర్భంగా సుమారు పది రోజుల పాటు ప్రేమ చుట్టూ తిరిగే వినూత్న కార్యక్రమాలు మిర్చిలో నిర్వహించారు. ఆర్జేల పిలుపుతో అనేకమంది శ్రోతలు ఉత్సాహాంగా ఫోన్లు చేసి తమ ప్రేమ కథల్ని పంచుకున్నారు. మరెన్నో ప్రేమ కథలు శ్రోతల మనుసు తాకాయి.

 ‘మిర్చి ఎక్స్ ట్రా లవ్’ లో ఒక్కొక్క ఆర్జే ఒక్కొక్క సెగ్మెంట్ లో షో నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్జే భార్గవి మిర్చి ‘లెజెండ్ లవ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఇన్ఫోసిస్ సుధా మూర్తి, అంజలి సచిన్, అనుష్కా విరాట్ కోహ్లీ, అమితాబ్, జయ బచ్చన్, రమ రాజమౌళి వంటి అనేక మంది వ్యాపార, సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న లెజెండ్స్ లవ్ స్టోరీస్ ని శ్రోతలతో పంచుకున్నారు. మోటివేషన్ మేలవించి చెప్పిన ఈ కథలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. 

ఆర్జే స్వాతి  మిర్చి ‘లవ్ యూ రాజా’ పేరుతో  ఉదయం 11 గంటల నుంచి  మధ్యాహ్నం 2 గంటల వరకు స్పెషల్ షో నిర్వహించారు. ఈ షోలో ఆమె ఫన్నీ లవ్ స్టోరీస్ చెప్పాలని కోరగా అనేక మంద్రి శ్రోతలు ఫోన్ చేసి ఉత్సాహాంగా తమ ప్రేమ కథల్ని పంచుకున్నారు. కొంతమంది శ్రోతలు ప్రేమ పాటలు పాడారు. మరికొంతమంది తమ లవర్స్ కి ప్రేమ పాటలు అంకితం చేశారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్జే అమృత ‘టైమ్ లెస్ లవ్’ పేరిట స్పెషల్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె  దేవదాస్ పార్వతి, లైలా మజ్నూ, రోమియో జూలియట్ ఇలా అనేక చారిత్రాత్మక ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ ని శ్రోతలతో పంచుకున్నారు. వీరితో పాటు పెళ్లి అయ్యి 50 సంవత్సరాలు అయిన జంటలను ఇంటర్వ్యూ చేసి, వారి అనుబంధాన్ని శ్రోతలకు తెలియజేశారు. నేటి సమాజంలో పెళ్లయిన కొన్నాళ్లకే  విడాకులు పేరిట విడిపోతున్న జంటలకు కనువిప్పు కలిగించేలా పెద్దవాళ్లు చెప్పిన ప్రేమ విశేషాలు శ్రోతలను అలరించాయి. 

సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఆర్జే సరన్ మిర్చి ‘హిడెన్ ల’వ్ స్టోరీస్ షో నిర్వహించారు.  చిన్నప్పటి నుంచి దాచుకున్న లవ్ స్టోరీస్, వన్ సైడ్ లవ్ స్టోరీస్, ఇప్పటికి చెప్పలేకపోయిన హిడెన్ లవ్ స్టోరీస్ ని శ్రోతలు సరన్ తో పంచుకున్నారు. ముఖ్యంగా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పేరు మార్చి చెప్పమని కోరిన సరన్ కి, శ్రోతలు సహకరించి సహృదయంతో తమ హృదయంలో దాచుకున్న ప్రేమను పంచుకున్నారు. వీరితో పాటు చాలామంది బావ మరదళ్లు కూడా ఫోన్ చేసి మాట్లాడటం ఈ షోలో హైలెట్ గా నిలిచింది.  వీటితో పాటు మిర్చి వాట్సాప్ కి పంపిన రికార్డెడ్ లవ్ స్టోరీస్ ని రేడియోలో చదివి వినిపించారు. రాత్రి వచ్చే డార్లింగ్ స్వేత షోలో… స్వీట్ లవ్ స్టోరీస్ వినిపించారు. ఈ షోలో ఆమె శ్రోతలను తమ ప్రేమ కథల్ని వీడియో రూపంలో పంపమని అడిగారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది కపుల్స్ తమ లవ్ స్టోరీస్ ని వీడియో రూపంలో షేర్ చేశారు. వారిలో  లక్కీ కపుల్స్ గా ఎంపికైన వారికి వాలంటైన్స్ డే రోజు మిర్చి టీం, ప్రత్యేకమైన డిన్నర్ ఏర్పాటు చేసింది.

ఇలా మిర్చిలో వాలంటైన్ వీక్ కి ప్రత్యేకమైన షోలు ఆకట్టుకున్నాయి. వీటికి తోడు ఇదొక ప్రేమ వసంతం అనిపించేలా రేడియో స్టేషన్ లో మొత్తం ప్రేమ పాటలు ప్లే చేశారు. 1990ల నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎవర్ గ్రీన్ ప్రేమ పాటల్ని మిర్చిలో ప్లే చేశారు. మిర్చి తీన్మార్ లో ప్రేమ పాటలు, మిర్చి శకుంతల, నాటు నీటు స్పెషల్ సెగ్మెంట్లలో కూడా ప్రేమనే నింపారు. దీంతో పాటు ఈ ప్రేమ మాసంలోనే డార్లింగ్స్ డైరీ పేరిట కొత్త ఐపీని కూడా మిర్చి  ప్రారంభించింది. ఇందులో డార్లింగ్ శ్వేత ప్రేమలో 360 డిగ్రీల్లో విభిన్న కోణాల్ని స్పృశిస్తుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అందమైన ప్రేమ కథలు, హైకులు డార్లింగ్ శ్వేత గొంతులో వినొచ్చు. ఇలా ఫిబ్రవరిలో ఎక్స్ ట్రా అవ్ అందించానికి మిర్చి చేసిన వినూత్న ప్రయత్నాలు అబాలగోపాలాన్ని అలరించడంతో విజయవంతం అయ్యాయి. వింటూనే ఉండండి 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు.