రొటీన్ ఫ్యామిలీ డ్రామా ..’ వారసుడు’ రివ్యూ..

రొటీన్ ఫ్యామిలీ డ్రామా ..’ వారసుడు’ రివ్యూ..

తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వారసుడు’. కన్నడ సోయగం రష్మిక మందన్న కథానాయక. టాలీవుడ్ ప్రోడ్యుసర్ దిల్ రాజు నిర్మాత. తెలుగులో కంటే రెండు రోజుల ముందు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు వర్షన్ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నిరాశపరిచిందా?
కథ:
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచలంచెలుగా ఎదిగిన పారిశ్రామికవేత్త రాజేంద్ర( రాజేంద్ర). అతనికి ముగ్గురు కుమారులు..జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్).
మైనింగ్ వ్యాపారంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న రాజేంద్ర అనారోగ్యం రీత్యా.. తన సంస్థకు వారసుడిని ప్రకటించాలనుకుంటాడు. ముగ్గురి కుమారుల్లో ప్రతిభావంతుడైన వాడికే సంస్థ బాధ్యతలను అప్పజెప్తానని ప్రకటిస్తాడు.అనూహ్యంగా విజయ్ తల్లితో కలిసి ఇంటి నుంచి బయటికొస్తాడు. ఏడేళ్ల తర్వాత అనుకొని పరిస్థితుల్లో తండ్రి(రాజేంద్ర)కి దగ్గరవుతాడు. ఇంతకు విజయ్ కుటుంబం నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? చివరకి తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరయ్యారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!

ఎవరెలా చేశారంటే..?
ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వారసుడులో విజయ్ క్లాస్ లుక్ అదిరిపోయింది. యాక్టింగ్ డాన్స్ కామెడీ టైమింగ్ తో అభిమానుల్ని అలరించాడు.ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాల్లో విజయ్ నటన హైలైట్ అని చెప్పవచ్చు.నటి రష్మిక మందనకు ఈచిత్రంలో అంతగా స్కోప్ లేదనే భావించవచ్చు. సాంగ్స్ పరంగా విజయ్ తో పోటీపడి స్టెప్పులేసింది. జయసుధ, శరత్ కుమార్ సినిమాకు బిగ్ ఎసెట్. ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే విలన్ పాత్రలో ఒదిగిపోయారు. శ్రీకాంత్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు…
రొటీన్ ఫార్ములా కథ ఐనప్పటికీ.. విజయ్ అభిమానుల దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.
సినిమా ఎండింగ్ వరకు .. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే నడిపించిన తీరును మెచ్చుకొని తీరాలి. తమన్ మ్యూజిక్ సినిమాకు బలం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.

మొత్తంగా చూస్కుంటే ఫస్ట్ ఆఫ్ ఒకే..సెకండ్ ఆఫ్ పరవాలేదు.
రేటింగ్: 2.75/5