Atmakur: ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న సిపియం పార్టీకి విరివిగా విరాళాలు అందించి ఆదరించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఓ ప్రకటనలో కోరారు. ప్రజా శ్రేయస్సు కై ఉద్యమాల ఊపిరిగా పోరాడుతున్న పార్టీని తమవంతు సహాయ సహకారాలు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీలల్లో సిపిఎం 3వ జిల్లా మహా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ సభలను విజయవంతం చేయాలని బిక్షం పిలుపునిచ్చారు.
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మకూర్ మండలం కూరెళ్ల గ్రామాంలో మహా సభల కర్ర పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బిక్షం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు పాదయాత్ర నిర్వహించి పోరాడిన ఏకైక పార్టీ సిపియం అని అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది కార్యకర్తలతో కలిసి రెండు రోజులపాటు వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించి .. ప్రభుత్వాన్ని మేల్కొల్పామని గుర్తుచేశారు. మూసి నీటి కాలుష్యాన్ని అరికట్టి – ప్రత్యామ్నాయ గోదావరి నీటిని అందించాలని డిమాండ్ చేశారు. బునాదిగాని కాలువ , భీమలింగం , పిలాయిపల్లి కాలువల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ రైతు , కార్మిక వ్యతిరేక చట్టాలు.. కార్పోరేట్ విధానాలపై పోరాటాలు నిర్వహించడంలో సిపియం పార్టీ ముందుండి పోరాడుతుందని బిక్షం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తుమ్మల గూడెం యాదయ్య, మర్రిపల్లి మల్లయ్య, బండ వీరయ్య, నార్కట్పల్లి మల్లయ్య, నిమ్మల రామ చంద్రయ్య, అంబోజు చంద్రయ్య, గడ్డం పోచయ్య, మారబోయిన రాములు, దుడ్డు ఎంకన్న, నిమ్మల రవి, నార్కట్ పల్లి ఉప్పలయ్య, బండ రాధమ్మ, బండ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.