పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గోడ దూకి పారిపోయిన ఇమ్రాన్ ఖాన్ !

పార్థ సారథి పొట్లూరి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి అతని నివాసానికి పోలీసులు వెళ్లారు కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ఇంటి గోడ దూకి పక్కనే ఉన్న వేరే వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడు !

కోర్టు ఆర్డర్ పత్రాలు తీసుకొని ఇస్లామాబాద్ పోలీసులు ఒక పోలీస్ సూపరిండెంట్ నేతృత్వం లో జమాన్ పార్క్ లో గల ఇమ్రాన్ ఖాన్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది ఈ సంఘటన!

పాకిస్థాన్ హోమ్ మంత్రి రాణా సన్ఉల్లాహ్ ప్రెస్ మీట్ పెట్టి విషయం విలేఖరులకి తెలిపాడు ! అరెస్ట్ వారంట్ తీసుకొని వెళ్ళిన పోలీసులకి ఇమ్రాన్ ఖాన్ తన ఇంటిలో లేడు కానీ ఫోన్ లో సంప్రదించగా తాను ఇంట్లో లేనని జవాబు ఇచ్చాడు కానీ పోలీసులు వెళ్ళిపోయిన తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో తన పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడాడు ఇమ్రాన్ !

ఒక మాజీ ప్రధానిగా ఇమ్రాన్ పోలీసులకి సహకరించి కోర్టుకి వెళ్ళి అక్కడే బెయిల్ తీసుకుని ఉంటే మర్యాద గా ఉండేది కానీ పారిపోవడం ఏమిటీ అంటూ విలేఖరుల ముందే పాకిస్థాన్ హోమ్ మంత్రి ఎద్దేవా చేశాడు!

ఇమ్రాన్ తరుపున లాయర్లు మరో వైపు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం నన్ను అరెస్ట్ చేసి జైల్లో హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు అని ఆరోపిస్తున్నాడు మొదటి నుండి ! చివరకి తాత్కాలిక కండిషనల్ బెయిల్ వచ్చింది మార్చి 18 వరకు ! ఇది జరిగింది శుక్రవారం మార్చి 7,2023 న.

అసలు ఇమ్రాన్ ఖాన్ మీద అరెస్ట్ వారంట్ ఎందుకు జారీ అయ్యింది ?

2018 నుండి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా పని చేసిన సంగతి తెలిసిందే ! అయితే ఇమ్రాన్ తాను అధికారంలో ఉన్న నాలుగేళ్ల లో ప్రధానమంత్రికి వివిధ దేశాల ప్రతినిధులు,స్థానికులు కానుకలు ఇచ్చారు. అవి పాక్ ప్రధాని కార్యాలయంలో భద్రపరచబడ్డాయి ! కానీ ఇమ్రాన్ ప్రధాని పదవి నుండి దిగిపోయిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండాల్సిన కానుకలు మాయం అయ్యాయి అయితే వీటిని అమ్ముకొని కాష్ చేసుకున్నాడు ఇమ్రాన్ ఖాన్ అంటూ ప్రస్తుత ప్రభుత్వం కేసు వేసింది. ఎన్ని సార్లు కోర్టు సమన్లు పంపించినా ఇమ్రాన్ ఖాన్ కోర్టుకి హాజరవ్వలేదు దాంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది !

అయితే ప్రధాని కార్యాలయంలో ఉండాల్సిన కానుకల గురుంచి తనకేమీ తెలియదని ఇమ్రాన్ అంటున్నాడు. కావాలనే నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి జైల్లోనే హత్య చేయాలని చూస్తున్నది ప్రస్తుత ప్రభుత్వం అని ఆరోపిస్తున్నాడు అందుకే నేను కోర్టుకి హాజరవ్వలేదు అని అంటూ వస్తున్నాడు !

నిన్న అంటే మంగళవారం రాత్రి మళ్ళీ పోలీసులు వచ్చారు ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి అని. కానీ ఇమ్రాన్ అంతకుముందే తన కార్యకర్తలకి పిలుపు ఇచ్చాడు మళ్ళీ పోలీసులు కనుక నన్ను అరెస్ట్ చేయడానికి నా ఇంటికి వస్తే మీరు అందరూ నాకు రక్షణగా ఉండాలి లేకపోతే నన్ను జైల్లో పెట్టి అక్కడే హత్య చేస్తారు అంటూ ! దాంతో ఇమ్రాన్ అభిమానులు నిన్న రాత్రి పోలీసులు రాగానే పోలీసులతో ఘర్షణకి దిగారు ! లాఠీ చార్జ్ తో పాటు బాష్ప వాయువు ని ప్రయోగించారు ! అఫ్కోర్స్ తనని అరెస్ట్ చేయడానికి పోలీసులతో పాటు మఫ్టీలో సైన్యం లో పనిచేసే కమాండో లు కూడా వచ్చారు అని ఇమ్రాన్ ఆరోపించాడు ! బహుశా ఇమ్రాన్ ఆరోపణ లలో నిజం కూడా ఉండి ఉండవచ్చు !

అయితే ఇమ్రాన్ ఖాన్ ని హత్య చేస్తారని 2022 ఫిబ్రవరి నెలలో రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడే నిర్ధారణ అయిపోయింది. 

పోనీ వెళ్ళినవాడు రష్యాతో క్రూడ్ ఆయిల్ సరఫరా ఒప్పందం గురుంచి మాట్లాడి ఉంటే వేరే గా ఉండేది కానీ 2022 ఫిబ్రవరి 23 తెల్లవారుఝామున పుతిన్ తన సైన్యాన్ని ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి అనుమతి ఇచ్చిన సందర్భంలో పని కట్టుకొని మాస్కోలోని విలేఖరులతో మాట్లాడుతూ పుతిన్ ఉక్రెయిన్ మీద దాడికి ఆదేశించడం చూస్తుంటే నాకు చాలా ఉద్విగ్నభరితంగా [Exitement ] అనే పదం వాడాడు. సహజంగానే అమెరికాకి కోపం తెప్పించింది ! అప్పుడే నిర్ణయం జరిగిపోయింది ఇమ్రాన్ హత్యకి ! ఈ విషయం నేను 2022 ఫిబ్రవరి 23 న నా పోస్ట్ లో చెప్పాను ఇమ్రాన్ ఎక్కువ కాలం పదవిలో ఉండడు అని కుదిరితే హత్యకి గురి అవుతాడు అని.

రష్యా పర్యటన ముగించుకొని తిరిగి పాకిస్థాన్ వచ్చిన కొద్ది నెలలకే సైన్యం ఒత్తిడితో తన పదవికి రాజీనామ చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ రాజీనామా తరువాత పలు పార్టీల కలగూర గంప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పాకిస్థాన్ లో.

షెహబాజ్ షరీఫ్ ప్రధాని పదవికి అర్హుడు కాదు కానీ సీనియర్ అనే నెపంతో కూర్చోపెట్టారు. షెహబాజ్ షరీఫ్ కి ప్రజలలో ఏమాత్రం ఆదరణ లేదు పాకిస్థాన్ లో. ఇక పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ని పాకిస్థాన్ పప్పుగా పిలుస్తారు కానీ పాకిస్థాన్ ప్రధాని పదవి రేసులో ఉన్నాడు బిలావల్ భుట్టో.

ప్రధాని పదవి కోసం వెంపర్లాట!

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్,ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు బిలావల్ భుట్టో లు రాబోయే ఎన్నికల తరువాత ఎవరికి వారు ప్రధాని అవ్వాలనే ఆశతో ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ కె ఎక్కువ ప్రజాదరణ ఉంది.

తనకి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ దేశ ప్రధానిని కానీ అధ్యక్షుడిని కానీ అమెరికా ఉపేక్షించదు ! అలాంటిది తమ దయా దాక్ష్యలా మీద మనుగడ సాగిస్తున్న పాకిస్థాన్ ప్రధాని విషయంలో అమెరికా ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ? సరిగ్గా ఒక ఏడాది గడవక ముందే పదవి పోయి ప్రాణ భయంతో విలవిలలాడుతున్నాడు ఇమ్రాన్ !

వెనకనుండి మద్దతు ఇస్తూ షెహబాజ్ షరీఫ్ ని ఇమ్రాన్ మీదకి ఉసిగొల్పుతున్నది అమెరికా ! అఫ్కోర్స్ సైన్యానికి కూడా ఇమ్రాన్ అంటే పడడం లేదు అయితే దీనికి వేరే కారణం ఉంది .. ఒక బహిరంగ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ మన దేశానికి అంటూ ఒక విదేశాంగ విధానం లేదు అదే భారత్ ని చూడండి వాళ్ళ విదేశాంగ మంత్రి మేము రష్యా నుండి చవకగా ఆయిల్ కొని తీరుతాము అంటూ అమెరికా తో తెగేసి చెప్పాడు కానీ అమెరికా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నది .. ఈ వ్యాఖ్య సైన్యానికి అసలు నచ్చదు ! కాబట్టి భవిష్యత్తులో మెజారిటీ వచ్చి స్వంతంగా ప్రధాని అయితే అది సైన్యానికి నష్టం కలుగచేస్తుంది ! తమ మాట వినని ఏ ప్రధానిని పదవిలో ఉండనివ్వదు సైన్యం !

ఒక సారి పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుండి కనుక చరిత్రని పరిశీలిస్తే ఏ ప్రధాని కూడా పూర్తి కాలం తన పదవిలో ఉండలేకపోయారు!

తదుపరి ప్రధాని బిలావల్ భుట్టో ?

నవాజ్ షరీఫ్,షెహబాజ్ షరీఫ్ లు ఎప్పటికి అయినా తనకి ప్రమాదం అని సైన్యం భావిస్తున్నది కాబట్టి ఒక పప్పు ని ప్రధాని పదవిలో కూర్చోబెడితేనే కానీ తన ఆటలు సాగవు అదే సమయంలో చైనా వైపు మొగ్గు చూపకుండా తమకి అనుకూలంగా ఉండే ప్రధానినే అమెరికా ఇష్ట పడుతుంది !

బిలావల్ భుట్టో ఏ దేశానికి పర్యటనకి వెళ్ళినా అక్కడి రాజకీయ నాయకత్వం తో పాటు డిప్లొమాట్స్ ని కూడా మంచి చేసుకుంటూ వస్తున్నాడు. జస్ట్ లాబీయింగ్ అన్నమాట ! మీకు అనుకూలంగా ఉంటాను దయచేసి నా ప్రధాని అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నాడు బిలావల్ భుట్టో !

అమెరికాకి కావలసింది ఇలాంటి వాడే ! అలాగే సైన్యానికి కూడా పనికి వచ్చే మరో గొప్ప గుణం ఉంది బిలావల్ భుట్టో కి అదేమిటంటే ఏ దేశ పర్యటనకి వెళ్ళినా తనకి ఏదన్నా వస్తువు నచ్చితే దాని ధర ఎంత అని చూడడు కొనేస్తాడు కానీ బిల్లు ఆయాదేశంలో ఉండే రాయబార కార్యాలయానికి పంపించమని వచ్చేస్తాడు ! మాకు జీతాలే సరిగ్గా సమయానికి రావట్లేదు కానీ బిలావల్ మాత్రం తమ మీదకి నెట్టేసి పాకిస్థాన్ వెళ్లిపోతున్నాడు అంటూ రాయబార కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు ! ఇక పాకిస్థాన్ కి వచ్చినా తాను కొన్న వాటికి ఎలాంటి పన్నులు కట్టకుండా నేరుగా విమానాశ్రయమ్ తన నుండి ఇంటికి వెళ్ళిపోతాడు !

పాకిస్థాన్ సైనిక జెనెరల్స్ కి కానీ ఇటు రాజకీయ నాయకులకి కానీ తమ దేశ ఆర్ధిక దుస్థితి గురుంచి ఎలాంటి ఆలోచన కానీ ఆందోళన కాని లేదు ! దొరికిన కాడికి దోచుకొని ఇక దోచుకోవడానికి ఏమీ దొరకనప్పుడు విదేశాలకి వెళ్ళి అక్కడ స్థిరపడిపోతున్నారు.

ఇక రాజకీయ నాయకులు పెంచి పోషించిన ఒక వర్గం ప్రజలు మాత్రం నిత్యావసర ధరలు ఎంత పెరిగినా పట్టించుకోకుండా విదేశాల నుండి ఖరీదయిన కార్లు మరియు ఇతర గృహోపకరణాలు దొడ్డిదారిలో పాకిస్థాన్ లోకి తెప్పించుకొని జల్సా గా బతకడానికే ఇష్ట పడుతున్నారు !

ఇక ఆఫ్ఘనిస్తాన్ కోసం భారత్ పంపిన 50 వేల టన్నుల గోధుమలని పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలో ఆపేసి వాటికి 40 రోజుల పాటు అనుమతి ఇవ్వకుండా చివరకి భారత్ పంపిన గోధుమలని తమ గోడౌన్ లలో దాచేసి వాళ్ళ దగ్గర ఉన్న పురుగు పట్టిన గోధుమలని లారీలలో లోడ్ చేసి వదిలారు గత సంవత్సరం! తాలిబన్లు పాకిస్థాన్ పేరు వింటేనే మండి పడడానికి కారణం ఇదే ! అందుకే ఈ సారి 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలని సముద్ర మార్గం ద్వారా ఇరాన్ లోని ఛాబహార్ పోర్టుకి తరలించి అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు భారత అధికారులు !

పొరుగున ఉన్న శత్రు దేశం పరిస్థితి ఎలా ఉందో,ఏమవబోతుందో తెలుసుకోవడం మనకి అవసరమే !

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల దగ్గర ఉన్న చివరి గ్రామం మధ్యన కిషన్ గంగా నది Pok కి మనకి సరిహద్దుగా ఉంది ఎప్పటి నుండో కానీ గత నెల రోజుల నుండి నదిని దాటి జమ్మూ కాశ్మీర్ లోకి రావడానికి PoK ప్రజలు ప్రయత్నిస్తున్నారు!

ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే పాకిస్థాన్ లో ని పరిస్థితులు చేయి దాటిపోయి చివరకి PoK ప్రజలు బలవంతంగా సరిహద్దులు దాటి మన దేశంలోకి రావడానికి చేసే ప్రయత్నంలో ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది కానీ ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము కానీ తెలుస్కోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి లేకపోతే మోడీజీ కావాలనే పాకిస్థాన్ తో ఘర్షణ కి దిగారు అనే ఆరోపణలు చేస్తాయి ప్రతి పక్షాలు ! వాటిని మనం తిప్పి కొట్టాలి అంటే అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండాలి !

జైహింద్ ! జై భారత్ !