Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?

Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?

Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు చాలా రోజులు ఉంది కదా అన్న  భ్రమల్లో పార్టీల  నేతలు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నామని తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. మోదీ గాలితో నెట్టుకు రావొచ్చని అటు బీజేపీ భావిస్తోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొద్దు నిద్ర విడిచి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళుతోంది. మరి ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందని ఓ ప్రవేట్ రిసెర్చ్ సర్వే సంస్థ జరిపిన అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి. రీసెర్చ్ సంస్థ సర్వే  ప్రకారం రాష్ట్రంలో  మెజార్టీ సీట్లు సాధించే పార్టీ ఏదంటే?

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అత్యధిక లోక్సభ సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై  ఓ ప్రవేట్ రిసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది.  రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్  పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆరు అంశాలను బేసే చేసుకొని సంస్థ సర్వే నిర్వహించినట్లు  తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మెజార్టీ సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థ తెలిపింది.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ  సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచి అవకాశం ఉందని వెల్లడించింది. ఇక  ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదని.. కనీసం సింగిల్ డిజిట్ సీటు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదని  అధ్యయనంలో తేలినట్లు సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉంటే సీట్ల పరంగా బీజేపీ పార్టీకి 8 నుంచి 12 సీట్లు.. అధికార కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 7 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఆసక్తికర విషయం ఏంటంటే? రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ  కనీసం ఒక్క సీటు గెలిచే అవకాశం కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఆ పార్టీ నుంచి వలసలు పెరగడం.. పార్టీ ముఖ్య నాయకులు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం.. లోక్సభ అభ్యర్థుల్లో సైతం గెలుపు అవకాశాలు సన్నగిల్లడం వంటి అంశాలు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మరాయన్న అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.