హార్ట్ ఆఫ్ దిపాలిటిక్స్ గా సికింద్రాబాద్ రాజకీయం నడుస్తోంది. మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పద్మారావుగౌడ్.. మరోసారి సీటు నాదేనని ధీమా వ్యక్తం చేస్తుంటే.. కంచుకోట లష్కర్ పై పట్టునిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం ఎట్టిపరిస్థితుల్లో సీటు గెలుచుకోవాలని పట్టుదలగా కనిపిస్తుంది. ప్రతిసారి విభినత్వాన్ని చాటుకునే లష్కర్ ఓటర్లు.. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
సికింద్రాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పద్మారావుగౌడ్ కొనసాగుతున్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఆయన పోటిచేయడం దాదాపు ఖరారైంది. కొద్ది రోజుల ముందు పార్టీ మారతారని ప్రచారం జరిగిన.. ఊహాగానాలే అంటూ పద్మారావు కొట్టిపారేశారు. తాను చేసిన అభివృద్ధే మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని ఆయన ధీమాగా కనిపిస్తుంటే.. ఈసారి పద్మారావు గెలుపు అంత ఈజీ కాదన్నది ప్రతిపక్షనేతల మాటగా తెలుస్తోంది. మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, డబుల్ బెడ్ రూం ఇండ్లు.. ఆస్పత్రుల మాటేమిటని ప్రజల ప్రశ్నస్తిన్న తీరే ఇందుకు నిదర్శమన్నది నేతల అభిప్రాయం. దీనికితోడు ఎమ్మెల్యే నలుగురు కుమారుల తీరు కూడా కొంత వ్యతిరేకత కారణమన్న వాదన వినిపిస్తోంది.
పట్టునిలుపుకోవాలని బీజేపీ…
తెలంగాణలో బీజేపీ కంచుకోటగా ఉన్న ఏకైక నియోజకవర్గం సికింద్రాబాద్. ఇక్కడ బండారు దత్తాత్రేయ ఎంపీగా మూడుస్లారు విజయం సాధించారు. ఆయన గవర్నర్ గా వెళ్లిపోవడంతో.. 2019లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటిచేయాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర పేరిట ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు పలువురు కాషాయం పార్టీ ముఖ్య నేతల కన్ను..లష్కర్ సీటుపై పడింది. ఇప్పటికే సీటు కోసం ప్రయత్నాలు మొదలెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీ లోచేరిన మాజీ మేయర్ బండ కార్తీక సైతం టికెట్ ఆశిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ మేరకు ఆమె పార్టీలో చేరినట్లు.. ఈసారి సీటు తనదేనని ధీమాగా కనిపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మాజీ మేయర్.
ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నేతల కుమ్ములాటలతో పార్టీ క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటిచేసిన ఆదం సంతోష్ కు.. ఈసారి టికెట్ కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. మారిన పరిస్థితుల ఆధారంగా కొత్తనేతకు టికెట్ దక్కవచ్చనే చర్చ పార్టీలో జరుగుతుంది.
మొత్తంమీద లష్కర్ నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని బీజేపీ భావిస్తుంటే.. పట్టుదలగా బిఆర్ ఎస్ కనిపిస్తోంది. బౌన్స్ బ్యాక్ తరహాలో రీఎంట్రీ ఇవ్వాలని కాంగ్రెస్ ఉవిళ్లుఊరుతుంది.