Karthikadeepam:
హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది.
ఎప్పుడు వెలిగించాలి?
పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా 360 వత్తులను వెలిగించవచ్చు.కార్తికమాస పౌర్ణమి నాడు వెలిగించడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది.ఆలయాల్లో, దీపోత్సవాల్లో ఈ దీపదానం చేయడం సత్కార్యం.ఇంటివద్ద వెలిగించాలనుకుంటే సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, లేదా పౌర్ణమి నాడు తులసి కోట వద్ద దీపాలను వెలిగించడం ఉత్తమం.వీలుకానివారు కార్తికమాసంలో ఏదో ఒక రోజున దీపదానం చేయవచ్చు.
వత్తుల సిద్ధం విధానం:
360 వత్తులను ముందుగా ఆవునేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి.ఇవి ఒకేసారి వెలిగించాలన్నా, విడిగా వెలిగించాలన్నా మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది.
ఎందుకు 360 వత్తులు?
మన పంచాంగంలో 15 తిథులు × 12 నెలలు = 180 తిథులు శుక్లపక్షానికి, అదే విధంగా కృష్ణపక్షానికి 180, మొత్తం 360 తిథులు సంవత్సరానికి సంకేతం.కాబట్టి 360 వత్తులు సంవత్సరంలోని ప్రతి రోజుకూ ప్రతీకగా నిలుస్తాయి. దీపదానం ద్వారా ఆ 360 రోజులకు పుణ్యప్రభను చేర్చినట్లవుతుంది.
దీపం వెలిగించడం అంటే చీకటిని పారదోలడం, జ్ఞానాన్ని ప్రసరించడం. భక్తి, శాంతి, సద్బుద్ధి, సంపద కలగాలని మనసారా కోరుకునే ప్రతి ఒక్కరూ కార్తికమాసంలో 360 వత్తులను వెలిగించాలి.

