కేంద్రం సాగు చట్టాలను మళ్ళీ తీసుకురానుందా?

వ్యవసాయ రంగంలో సంస్కరణలోభాగంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను.. మోదీ సర్కార్‌ మళ్లీ తీసుకురానుందా? రైతుల అభ్యతంరాలతో ఒక అడుగు వెనక్కి తగ్గామే తప్ప! మళ్లీ తీసుకొచ్చే అవకాశముందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యల్లో వాస్తమెంత?
దేశవ్యాప్తంగా దూమారం రేపిన సాగు చట్టాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా మహరాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై.. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. 74 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌ అత్యద్భుతమైన చట్టాలను తీసుకొచ్చిదన్నారు తోమర్‌. అయితే కొందరూ అవాస్తవాలను ప్రచారం చేసి.. రైతులను ఉద్యమానికి ఉసిగొల్పడంతో.. కేవలం ఒకడుగు వెనక్కి వేశామే తప్ప.. మళ్లీ తీసుకొచ్చే అవకాశముందన్న.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాయి.
కాగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉభయసభల్లో ప్రకటనలు చేశారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళనలు నిర్వహించారు. ఆసమయంలో రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే.. విపక్ష పార్టీలు అవాస్తవాలను ప్రచారం చేసి రైతులను తప్పుదారి పట్టించి.. ఉద్యమానికి ఉసిగొల్పుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. మరోవైపు ఆందోళన విషయంలో రైతులు తగ్గకపోవడంతో.. స్వయంగా ప్రధాని మోదీ.. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. చట్టాల రద్దుకు సంబంధించి బిల్లు ఉభయ సభల్లోమోదం పొందింది.

Optimized by Optimole