వైఎస్ షర్మిల పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత!

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా వైఎస్‌ షర్మిల, తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు షర్మిల బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె లోటస్‌పాండ్‌లో ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. నా తండ్రీ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో తమ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరంటూ ఆమె స్పష్టంచేశారు. మరో వైపు పార్టీ ప్రకటనకు సంబంధించి సభకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కరుణ ఉద్ధృతి ప్రధాన సమస్యగా మారింది.

Optimized by Optimole