వైసిపి 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవచ్చు: నాదెండ్ల మనోహర్

ప్రతిపక్షాల జెండా.. అజెండా గురించి అతిగా ఆలోచించడం మానేసి ముఖ్యమంత్రి దమ్ము చూపుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవాలనీ, ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోవచ్చని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ము లేదు కాబట్టే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలో రాజకీయ కక్షలు రెచ్చేగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంలోకీ ఐ ప్యాక్ వాళ్ళని తీసుకువచ్చి ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను నిర్మిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే సామాన్య ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకోవాలని హితువుపలికారు.

కాగా ముఖ్యమంత్రి తెనాలి పర్యటన గురించి రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎందుకు చూసిందన్నారు మనోహర్. ముఖ్యమంత్రి ఖచ్చితంగా నియోజకవర్గానికి పనికి వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారని ప్రజలు భావించారన్నారు. చిరు వ్యాపారులు, సామాన్యులు పర్యటించే రహదారిపై సీఎం పర్యటిస్తే మార్పు వస్తుందని తెనాలి ప్రజలు ఎదురు చూశారని.. మొక్కుబడి పర్యటనలా జగన్ హడావిడిగా హెలికాప్టర్లో వచ్చి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. గతంలో తెనాలి – మంగళగిరి మధ్య ప్రయాణానికి 30 నిమిషాలు సమయం పట్టేదని.. ఇప్పుడు గుంతల వల్ల నిత్యం ప్రమాదాలు జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ప్రయాణ సమయం కూడా గంటకు పైగానే పడుతోందన్నారు. రోడ్డుకు కనీసం మరమ్మతు చేయించే దిక్కులేదని నాదెండ్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Optimized by Optimole