ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా మౌనం వహించిన వైఎస్ ఆత్మ డాక్టర్ కేవిపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.తన ముఖ్య అనుచరడు గిడుగు రుద్రరాజును ఏపీసీసీ పీఠంపై కూర్చొబెట్టారు.ఏపీ లో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన కేవీపీ యాక్టివ్ అవడంతో .. రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.
కాగా నూతన పరిణామాలతో ..పాత కాంగ్రెస్ నాయకులు..రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులు..మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా కింద పునరేకీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత కకావికలమైన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం కొంత కాలం పాటు కేవీపీని అంటి పెట్టుకొని పార్టీలో కొనసాగారు. ఢిల్లీ అధిష్టానం తో ఆయన సత్ససంబంధాలు నెరుపుతున్నపట్టికి ప్రజల్లో కాంగ్రెస్ ఆదరణ కోల్పోవటం వల్ల ఎవరికి వీలున్న మార్గాల్లో వారు వెళ్ళిపోయారు.మెజారిటీ వర్గం వైఎస్సార్సీపీ కి వెళ్లిపోగా..ఇతరులు వీలైన వేరే రాజకీయ వేదికలకు వెళ్ళారు.
అటు అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.వైఎస్సార్సీపీ కి బలమైన ప్రత్యామ్నాయంగా టిడిపి, బీజేపీ ,జనసేన నిలబడలేని పరిస్థితులు ఉన్నాయి.ఢిల్లీ నాయకత్వం ఆశీస్సులతో కాంగ్రెస్ పాత శక్తులన్ని ఒక్క తాటి పైకి వస్తే.. లోగడ వివిధ స్థాయిల్లో పనిచేసిన కాంగ్రెస్ శ్రేణులు.. ఇటు వైపు చూసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.దీంతో కేవీపీ_ గిడుగు ద్వయం ఈ కేంద్రకాన్నీ ఎంత బలోపేతం చేస్తుందన్న ఆసక్తి రాజకీయా వర్గాల్లో కనిపిస్తోంది.
ఇంతకాలం వేరువేరు పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ లో చేరి, ఇప్పుడు జగన్ వైఖరి వల్ల అందులో ఇమడలేకపోతున్న మంత్రులు.. సీనియర్ నాయకులు..తాజా పరిణామాల్లో కాంగ్రెస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.