2022
క్లైమాక్స్ కి చేరిన మహరాష్ట్ర రాజకీయ సంక్షోబం!
మహరాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.ఈమేరకు గవర్నర్ సీఎంకు లేఖరాశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయం పై శివసేన మండిపడుతోంది.బలనిరూపణ చట్టవిరుద్ధమని.. ఈవిషయమై సుప్రీం కోర్డు కు వెళ్తామని స్పష్టం చేసింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ని కోరిన కొద్ది గంటల్లోనే.. భగత్ సింగ్ కోశ్యారీ బలనిరూపణపై నిర్ణయం…
అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!
ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు….
ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ పై టీంఇండియా విజయం… సీరీస్ కైవసం!
ఐర్లాండ్ తో జరిగిన టీ 20 సీరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో హార్దిక్ జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఆటగాడు దీపక్ హుడా పొట్టి ఫార్మాట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగగా.. సంజూ…
ఐసీసీ ర్యాకింగ్స్ లో దుమ్ములేపిన భారత మహిళ క్రికెటర్లు..!!
భారత మహిళ క్రికెటర్లు ఐసీసీ ర్యాకింగ్స్ లో అదరగొట్టారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్లో టాప్20 లో నలుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో.. స్టార్ ప్లేయర్ స్మృతి మంథాన టాప్ టెన్ లో 4 వ స్థానాన్ని దక్కించుకుంది . మరో క్రికెటర్ జెమ్మి రోడ్రిగ్స్ 14 వస్థానంలో .. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 18 వ స్థానంలో నిలిచారు..శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు 664 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బౌలింగ్…
