అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!

ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

ఇక మీనాకు 2009 లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విద్యాసాగర్ తో వివాహం జరిగింది. దంపతులకు నైనికా అనే ఓ కుమార్తె ఉంది. తమిళ్ స్టార్ విజయ్ నటించిన థేరి చిత్రంలో బాలనటిగా నైనికా నటించింది. అటు మీనా సైతం సెకండ్ ఇన్నింగ్స్లో దృశ్యం 2 తో పాటు పలుచిత్రాల్లో నటించింది.