ప్రభుదేవా పాటకు అదిరేటి స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్!
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక వింతలు ,విశేషాలతో పాటు.. వ్యక్తుల్లో దాగున్నటాలెంట్ ప్రపంచానికి పరిచయం అవుతోంది. ఈక్రమంలోనే రోడ్డు పై ఓ సాధారణ వ్యక్తి.. ప్రభుదేవా సాంగ్ కి చేసిన డ్యాన్స్ నెటిజన్స్ మనసులను గెలుచుకుంది. సోషల్ మీడియాలో 13 లక్షల మంది ఈవీడియోని వీక్షించారు. ఇంతలా వైరల్ అవుతున్న వీడియోని మీరు ఓ సారి చూసేయండి!
View this post on Instagram
ఇక వీడియో చూసినట్లయితే..ఓమధ్య వయస్కుడైన వ్యక్తి ‘ జెంటిల్ మెన్’ చిత్రంలోని ‘చిక్కు బుక్కు రైలే’ పాటకి డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. అతని మూన్ వాక్ డ్యాన్స్ కి చుట్టు ఉన్న స్నేహితులు మంత్ర ముగ్దులై వీక్షిస్తున్నారు. ఈవీడియోని రాజుకుమార్ అనే వ్యక్తి వారం క్రితం ఇన్ స్టాలో ‘డ్యాన్సర్ రమేష్’ అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు.
డ్యాన్స్ వీడియో పట్ల నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.”అంకుల్ వాకింగ్ స్టైల్ అదిరందంటూ ఓనెటిజన్ కామెంట్ చేయగా.. మరోనెటిజన్ ‘ఎజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటూ క్యాప్షన్ జోడించాడు’ . తెలుగు యాక్టర్ రచ్చరవి హార్ట్ ఎమోజీతో కామెంట్ చేయగా.. క్రికెటర్ సంజూ శాంసన్ స్మైల్, ఒకే హ్యాండ్ ఎమోజీ క్యాప్షన్ జతచేశాడు.