Sambashiva Rao :
నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బీజీగా మారిపోయాడంటే తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోనంతగా. రోజు పని ఒత్తిడి కారణంగానో మరే ఇతర కారణాలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వేళాపాళా లేకుండా భోజనం తీసుకుంటున్నారు. అయితే సరైన సమయంలో ఆహారం తీసుకోకుంటే వచ్చే అనర్థాలు అనేకం ఉన్నాయి. సమయానికి భోజనం చేయకపోవడం వలన శరీరంలో అనేక రకాల వ్యాధులకు ఆవాసంగా మారనుంది. ముఖ్యంగా అనేక మంది రాత్రి పూట లేటుగా తింటుంటారు. అలేట్ గా తినడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ అధ్యాయనం ప్రకారం.. సమయానికి ఆహారం తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. నిద్రవేళలో ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా, అదనపు కేలరీలు శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇది కొవ్వు రూపంలో నిల్వ ఉండనుంది.
కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో నిద్రవేళలో ఆహారం తిన్న ఎలుకల జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావితం చూపాయంట. అలాగే నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని కనుగొన్నారు. ఈ ఎలుకలలో జ్ఞాపకశక్తి కోసం ఏర్పడే అణువులు చాలా ప్రభావితమయ్యాయంట.
పరిసోధనలో రాత్రి భోజనం, నిద్రకు మధ్య 3 గంటల సమయం ఉండాలని తెలిపారు. మనం రోజు ఆహారం బెడ్ కి వెళ్లే 90 నిమిషాల ముందు తినాలి. అలా తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణింకాగలదు.
రాత్రి సమయంలో తక్కువ శారీరక శ్రమ కారణంగా జీవక్రియ మందగిస్తుంది. శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో శరీరానికి సరైన పోషకాహారం అందదు. ఈ కారణంగా మన శరీరంపై వ్యాధులు దాడి చేసే ప్రమాదం మరింత పెరుగుతుంది.
రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం: పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అధిక బీపీ, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను పెంచుతుంది. రక్తంలో ఒక నిర్దిష్ట కొవ్వును పెంచేందుకు సహాయపడుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఈటింగ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిజానికి, అలసట కారణంగా ఇది జరుగుతుంది. అలసట కారణంగా ఓ వ్యక్తి త్వరగా శక్తిని తెచ్చుకునేందుకు ఆహారాన్ని తీసుకుంటాడు.