APPOLITICS : జనసేన 10 వ ఆవిర్భావ సభ సూపర్ సక్సెస్ తో ఆపార్టీలో జోష్ నెలకొంది. పార్టీ నేతలు , కార్యకర్తలు సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. జనసేన సోషల్ మీడియా వారియర్స్ సంగంతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూ స్థానం తెలంగాణ.. ఇక మనదే అప్పుల రాష్ట్రమని అరిచేవాళ్ల నోరు మూయించొచ్చు సార్, మనకు తోడు దొరికింది అంటూ వైసీపీ నేతలు సీఎం జగన్ కు చెబుతున్నట్టు రూపొందించిన కార్టూన్ ను నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలన దొందు దొందే తరహాలో సాగుతోందని కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు.