×

Nancharaiah merugumala ( political analyst): 1 9 ఏళ్ల కిందటే తంగజం మనోరమపై భారత ఆర్మీ ‘హత్యాచారం’పై నగ్నంగా వీధుల్లోకి వచ్చిన 12 మంది మణిపురీ మహిళల నిరసన ప్రదర్శన”

Myanmar:  కల్లోల మణిపుర్‌ లో ఇద్దరు కుకీ ఆదివాసీ స్త్రీలను బట్టలూడదీసిన హిందూ వైష్ణవ బహుసంఖ్యాకులైన మేతయీ పురుషులు వారిని ఊరేగించి అవమానించడంపై దేశవ్యాప్తంగా నేడు నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు నిప్పులు కక్కుతున్నారు. అనేక జాతుల జనమున్న ఈ చిన్న రాష్ట్రంలో కమ్యూనిస్టు (మార్క్సిస్టు) సిద్ధాంతాల ప్రభావంతో కొన్ని తీవ్రవాద తిరుగుబాటు సంస్థలు దశాబ్దాల క్రితమే ప్రభుత్వ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలపై పోరాటాలు జరిపాయి. అస్సాం రైఫిల్స్‌ వంటి భారత సైనిక దళాలు మణిపురీ తీవ్రవాదులను అణిచివేసే క్రమంలో అనేక స్థానిక ఆదివాసీ వర్గాలు, మేతయీ గ్రూపుల మధ్య ఉన్న విద్వేషాలను బాగా వాడుకున్నాయి. వివిధ జాతుల జనం మధ్య నిలిచిన నిప్పులపై పెట్రోలు, డీజిల్‌ పోసి మంటలు ఎగిసిపడేలా చేశాయి అస్సాం రైఫిల్స్‌ వంటి భారత సాయుధ సైనిక దళాలు. ఈ క్రమంలో మణిపురి మిలిటెంట్లను సక్రమంగా ఎదుర్కొనే సామర్ధ్యం లేని సాయుధ బలగాలు మణిపురి మహిళలపై తమ ప్రతాపం చూపించేవి.

19 ఏళ్ల క్రితం 2004 జులై11న 32 సంవత్సరాల వయసున్న తంగజం మనోరమా (1971–2004) అనే మేతయీ యువతిని 17వ అస్సాం రైఫిల్స్‌ జవాన్లు రేప్‌ చేసి చంపేశారు. మనోరమ శవాన్ని ఆమెను అరెస్టు చేసిన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో వారు విసిరేసి వెళ్లిపోయారు. కుళ్లబొడిసి ఉన్న మనోరమ శవం కనిపించిన తర్వాత జనాగ్రహం ఆకాశాన్ని అంటింది. ఆమె శరీరంలో ఆరు బులెట్లు దొరికినాగాని సైనికుడెవరినీ అరెస్టు చేయలేదు. ఆమెను బలత్కరించడానికే ఇంటి నుంచి జవాన్లు తీసుకుపోయారని ప్రజలకు అర్ధమైంది. దీంతో హత్యాచారం జరిగిన నాలుగు రోజులకు 2004 జులై 15న మణిపురీ మహిళలు 12 మంది తమ బట్టలు పూర్తిగా తీసేసి ఇంఫాల్‌ లోయలోని కాంగ్లా కోట ముందు ప్రదర్శన నిరసన జరిపారు. తమ ప్రధాన శరీర భాగాలకు–‘ భారత సైన్యమా, మమ్మల్ని రేప్‌ చేయి (ఇండియన్‌ ఆర్మీ, రేప్‌ అజ్‌)’ అని ఇంగ్లిష్‌ లో రాసి ఉన్న ఫ్లెక్సీని కొంత వరకు అడ్డుపెట్టుకుని నిరసన తెలపడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మణిపురీ మహిళలు సైనిక దళాల చేష్టలపై నిరసన తెలపడానికి నగ్నంగా వీధుల్లో ప్రదర్శన జరపడం డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయిన కొద్ది రోజులకే తీవ్ర విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్‌ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యూపీఏ) సర్కారు తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యగా మణిపూర్‌ సంక్షోభం కనపించింది. కాని, యూపీఏ పోయి ఎన్డీఏ వచ్చి 9 ఏళ్లయినా, మొత్తం 19 సంవత్సరాలు గడిచినా సంక్షోభం తీవ్రమైందేగాని మంటలు ఇంకా ఆరలేదు. ఇద్దరు కుకీ స్త్రీలను నగ్నంగా బహిరంగంగా నడిపించిన మేతయీలు నేడు ప్రపంచం ముందు అత్యంత దుర్మార్గమైన హిందూ ధర్మం అనుసరించే మనుషులుగా నిలబడ్డారు. 2004 నాటి పన్నెండు మంది మణిపురీ మహిళల నగ్న నిరసన ప్రదర్శన నేడు చరిత్ర చీకటిలో కలిసిపోయింది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all
Optimized by Optimole