×

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈపూజ నిర్వహించడానికి గలకారణం ఏంటి? దుర్గాష్టమి రోజునే ఈ పూజను ఎందుకు నిర్వహిస్తారు?  పూజ విధానం ఏంటి?

దసరా(విజయదశమి) పండగకు ఒకరోజు ముందు దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజున భక్తులు అమ్మవారిని శరణువేడుతూ ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తరతరాలుగా వస్తున్న ఈఆచారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఆయుధ పూజనే అస్త్ర పూజగా పిలుస్తారు.కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేక పోటిలు నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే అస్త్ర పూజను పురస్కరించుకుని సరస్వతీ దేవి పూజ చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఈపూజను ‘గోలు’అంటారు. ఈరోజున అక్కడ బొమ్మల కొలువు నిర్వహిస్తారు.

చెడుపై మంచి విజయాన్ని గుర్తుగా..

చెడుపై మంచి విజయానికి గుర్తుగా హిందువులు అస్త్ర పూజను నిర్వహిస్తారు. రావణ వధకు ముందు శ్రీరాముడు కూడా ఆయుధ పూజ నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.దుర్గాష్టమి రోజు దుర్గమ్మను శరణువేడుతూ ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీ. ఈరోజున రైతులు కొడవలి , నాగలి, పనిముట్లకు, వివిధ వృత్తుల వారు తమ వస్తువులకు పసుపు,కుంకుమ అద్ది దేవతలతో సమానంగా ఆరాధించి పూజిస్తారు.ఇలా చేస్తే శత్ర పీడ,బాధలు దరిచేరవని భక్తుల నమ్మకం. అస్త్ర పూజకు సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి విశేషాలను తెలుసుకుందాం!

పాండవుల అస్త్ర పూజ..

పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు జమ్మిచెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచినట్లు పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాక అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్ళే ముందు ఆయుధ పూజ నిర్వహించినట్లు పురాణా పండితులు చెబుతుంటారు.శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకునేందుకు పాండవులు ఆయుధ పూజ చేశారని భక్తుల నమ్మకం. ఇదే రోజున దుర్గాదేవి.. దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించినట్లు.. చెడుపై మంచి విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకోవడం  హిందువుల సంప్రదాయంగా వస్తోంది.

ఓందం దర్గాయైనమ: మంత్రం పఠించాలి..

దుర్గాష్టమి రోజున ధ్యానం చేసిన తర్వాత అమ్మవారికి పూజలు చేయాలి.అనంతరం ఓం దుం దుర్గాయైనమ: మంత్రాన్ని పఠిస్తే శుభం జరుగుతుందని పురాణా పండితులు చెబుతుంటారు. కోఠి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని స్మరిస్తూ.. శత్రుబాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.ఈమంత్రంతో పాటు లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఆతర్వాత ఆయుధ పూజ లేదా అస్త్ర పూజలు చేయాలి.

ఆయుధ పూజ విధానం…

ఆయుధ పూజను ప్రధానంగా కర్ణాటక , తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రతిఒక్కరూ తమకు జీవనోపాధి కల్పించే వస్తువులన్నింటిని అమ్మవారి ముందు ఉంచి పూజలు చేస్తారు. పూజకు ముందు ఇల్లు,దుకాణం , కార్యాలయాలు శుభ్రం చేసి తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు.విద్యార్థులు తమ పుస్తకాలను దేవి ముందు ఉంచి పూజిస్తారు.మామిడి ఆకులు , అరటి ఆకులతో అలంకరించి , ధూపం_దీపంతో శుభం జరగాలని దుర్గాదేవిని వేడుకుంటారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

TTD: శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం అమలు

తిరుమల, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో...

Read out all

ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర

Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో...

Read out all

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం...

Read out all

kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని...

Read out all

Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?

Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం....

Read out all

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం...

Read out all
Optimized by Optimole