Sambasiva Rao :
============
రోజు బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆరోజుల్లో అయితే ఇంట్లో రాత్రి వండిన ఆహారాన్నే ఉదయం ఆరగించేవారు. సద్దన్నంతో పచ్చి మిర్చి, లేదా ఉల్లిపాయ కలిపి తినేవారు. మరికొందరైతే రాగి అన్నం, జోన్న , సద్దలు తినేవారు. అయితే ఈరోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీ, దోశ, పూరీ, వడ, ఉగ్గాని రూపంలో తీసుకునే వారున్నారు. ఉరుకుల పరుగు జీవితంలో రోజు తిండితినడానికి కూడా టైమ్ దొరకదు కొంతమందికి. ఈ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ ప్రతి ఇంట్లో తప్పనిసరైపోయింది. అయితే ఉదయాన్ని ఇడ్లీ లాంటివి కాకుండా, ఇంకా ఏంతీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం..
జొన్న రొట్టె..
జోన్నలు ఆరోగ్యానికి చాలా మంచిదంట. జొన్నతో రొట్టె చేసుకునిరోజు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారంట. జొన్నల్లో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జోన్న రోట్టేకు నెయ్యి, వెన్న వేసుకుని మీకు ఇష్టమైన కూరతో ఆరగించాలి.
పాలకూర దోశ..
పాలకూరలో పోషకాల ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి. పాలకూర దోశ తినడం ద్వారా శరీరానికి అధికంగా పోషకాలు అందుతాయి.
పెసర మొలకల సలాడ్.
సలాడ్స్‌ని ఇష్టపడే వారైతే.. ఇది హ్యాపీగా ట్రై చేయొచ్చు. పెసలు నానబెట్టి, మొలకలు వచ్చాక.. వాటికి ఉడికించి చేయాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కారం, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి రుచిచూడడమే.
బనానా ఓట్ పాన్ కేక్..
మెగ్నీషియం పుష్కలంగా ఉన్న మాంచి ఫుడ్‌లో ఆల్మండ్ బటర్ టోస్ట్ కూడా ఒకటి. 2 హోల్ గ్రెయిన్ బ్రెడ్‌ని తీసుకుని వాటిపై ఆల్మండ్ బటర్ రాసి తినాలి. టెస్ట్ కోసం అరటిపండ్ల ముక్కలతో తినొచ్చు. మరింత టేస్ట్ కావాలనుకుంటే కాస్తా తేనె కలిపి తినొచ్చు.
గమనిక: ఈ వివరాలను ఇంటర్నెట్ లో పరిశీలించి అందించాం. మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.