ఆర్మీ ఆఫీసర్ పాదాలను తాకిన చిన్నపాప..ప్రశంసల వర్షం.. వీడియో వైరల్

దేశ సరిహద్దుల్లో రేయింబవళ్లు పహార కాసే సైనికుల సేవలు వెలకట్టలేనివి. వారి త్యాగాలు మరువలేనివి. వీధుల్లో భాగంగా వారు తారసపడితే చాలు గౌరవవించిన వీడియోలు ఇంటర్నెట్లో చాలానే చూశాం. అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్న అమ్మాయి ఆర్మీ ఆఫీసర్ పాదాలు తాకి కళ్లకు అద్దుకున్న వీడియో నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది.ఈ వీడియోను బెంగళూరు పార్లమెంటు సభ్యుడు పిసి మోహన్ శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. ” దేశభక్తిని యువతలో పెంపొందించడం తల్లిదండ్రుల కర్తవ్యం.. ప్రతి ఒక్కరూ మాతృభూమి కోసం రుణపడి ఉండాలి.. జైహింద్ ” అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ట్విట్టర్ వీడియో చూసినట్లయితే .. నల్లటి దుస్తులు ధరించిన ఒక చిన్న అమ్మాయి మెట్రో స్టేషన్ వద్ద నిలబడి ఉన్న ఆర్మీ సిబ్బంది వైపు వెళుతోంది. అక్కడున్న అధికారుల్లో ఒకరూ అప్యాయంగా పలకరించగా..అమ్మాయి అకస్మాత్తుగా వంగి హృదయపూర్వక సంజ్ఞతో అతని పాదాలను తాకింది. ఈ వీడియోను మెట్రో స్టేషన్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వీడియోనూ ట్విట్టర్‌లో 1.1 మిలియన్లకు పైగా వీక్షించగా 83,000 మందికి పైగా లైక్ చేసారు. వేలాది మంది రీ-ట్వీట్ చేశారు.

మరోవైపు చిన్నారిపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. ఓ నెటిజన్ .. ఈ వీడియోను చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని కామెంట్ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ ‘ పెంపకం అంటే ఇలా ఉండాలి.. నన్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది’.. డీప్లీ హత్తుకునే క్షణమంటూ కామెంట్ చేయగా..మరో వ్యక్తి ‘తరువాతి తరానికి మనం నేర్పించవలసినది ఇదే” అంటూ కామెంట్ జోడించాడు.

Related Articles

Latest Articles

Optimized by Optimole