బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య ‘అఖండ’..’

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల ఉనికిపై నెలకొన్న ప్రశ్నలను బాలయ్య అఖండ సినిమా కలెక్షన్లతో పటాపంచలు చేశాడు. నటసింహం కసితీరా జూలు విదిలిస్తే బాక్సాఫీస్ ఇలా ఉంటుందా తరహాలో.. అఖండ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ పండితులు సైతం బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం చూసి ఆశ్చర్య పోతున్నారు.
ఇక మాస్ జాతర ఎలా ఉంటుందో.. సింహ.. లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీ అఖండతో బోయపాటి- బాలయ్య జోడి మరోసారి చూపించింది. అఖండ సినిమా విడుదలైన అన్నిచోట్లా తొలి మూడు రోజులు హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. శని, ఆదివారం వీకెండ్ కావడంతో మరిన్ని రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అటు అఖండ సినిమా తొలి 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 29.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాలయ్య.

Optimized by Optimole