భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్!

భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. తాజాగా దేశంలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదయ్యింది. సౌతాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఈ వేరియంట్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు దేశంలో మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు.
ఇక దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా ఇప్పటివరకు 38 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ వచ్చిన ఒమిక్రాన్ వైరస్.. బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో రకరకాల భయాలు ప్రచారంలోకి వచ్చాయి. WHO హెచ్చరికలతో అన్ని దేశాలు ముందు జాగ్రత్తా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా నిబంధనలు పెట్టాయి. దీంతో ఒమిక్రాన్‌ వల్ల భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందా..? వైరస్‌ను ఎదుర్కోవడం ఎలా..? అనే ఆందోళనలు సర్వత్రా మొదలయ్యాయి.