ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు శుభవార్త అందించింది. సినిమా టికెట్స్ రేట్లనూ సవరిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా సినిమా టికెట్ రేట్లను నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్లు.. నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ.. కనీస టికెట్ ధర రూ. 20.. గరిష్టంగా రూ. 250 గా రేట్లు నిర్దారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు.. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ గా నిర్ణయించారు. ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం, నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ చేశారు.
అటు టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. థియేటర్ల మనుగడ.. ప్రజల వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని జీవో జారీ చేసినందకు జగన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.