మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్..!

మెగాస్టార్ చిరంజీవి ,డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా శృతి హాసన్ నటించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ తో శృతి హాసన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. వెల్కమ్ శృతిహాసన్ అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా మెగాస్టార్ .. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాక మరో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

అటు శ్రుతిహాసన్ సైతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. క్రాక్ హిట్ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స్వింగ్లో దూసుకుపోతుంది. ప్రభాస్ .. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్లో నటిస్తున్న ఈ అమ్మడు .. గోపిచంద్ మలినేని.. బాలకృష్ణ మూవీలోనూ హీరోయిన్‏గా నటిస్తోంది.