దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 వేల 575 కేసులు నమోదుకాగా.. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 7 వేల 416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46 వేల 962 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 18 లక్షల 69 వేల 103డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,33,99,555కు చేరింది.