అయోధ్య రామాలయం వీడియో విడుదల!

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి ఆలయ నిర్మాణం అయోధ్యలో ఎంతో వైభవంగా జరుగుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కల త్వరలో నెరవేరబోతోంది. భక్తుల అనుగుణంగా అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించి అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ 5 నిమిషాల నిడివిగల వీడియోను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసింది. ఆ 3డీ యానిమేషన్ వీడియో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక ఆలయానికి చేరుకునే రోడ్డు మార్గం, గతంలో కట్టిన శ్రీరామ మందిరంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తోన్న భవ్య మందిరం దృశ్యాలను ఏరియల్‌ వ్యూలో ప్రత్యేకంగా చూపించారు. అయోధ్యలో శ్రీ రామ మందిరం రూపకల్పనను అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ సోమ్‌పురా ఫ్యామిలీ రూపొందించింది. పాత డిజైన్‌కు మార్పులతో…కొత్త మోడల్లో ఆలయం ఎత్తు, పరిమాణం, వైశాల్యం లాంటి ప్రాథమిక ప్రమాణాల నిర్మాణంలో గణనీయమైన మార్పులు చేసినట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు.మూడున్నర ఏళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ ఆలయ వైభవాన్నిపెంచేందుకు 5 గోపురాలు నిర్మించనున్నారు. ఇందులో సింహ ద్వారం, నృత్య మండపం, రంగ మండపాలను నిర్మించనున్నారు.
అయోధ్య రామ మందిరం ముందు అనుకున్నట్లు కాకుండా .. ఆలయాన్ని మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇందులో 318 స్తంభాలు…ప్రతి అంతస్తులో 106 స్తంభాలు నిర్మించనున్నారు. ఆలయం పూర్తిగా వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మిస్తున్నారు. రామ్ లల్లా గర్భగుడి ఎక్కడైతే నిర్మిస్తారో…. దాని పైభాగంలో మాత్రమే ఆలయ ప్రధాన గోపురం ఉండేలా నిర్మాణం జరుగుతోంది. ఈ రామాలయం ఎత్తు 33 అడుగులు ఉండనుంది.
కాగా 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ నిర్వహించగా….ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌ నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రకటించింది.

Optimized by Optimole