OTTREVIEW: ఓటీటీ వేదికలు వచ్చాక సినిమాలతో పాటు పలు వెబ్ సిరిస్‌లు సిని ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందిన “బహిష్కరణ” జీ5(Zee 5) ఓటీటీలో శుక్రవారం విడుదలైంది . హీరోయిన్లు అంజలి, అనన్ల నాగళ్ల,శ్రీతేజ, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈసిరిస్ కథ ఏంటి? ఎలా ఉందో? సమీక్షలో తెలుసుకుందాం..!
కథ;
గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి తో పాటు పలు గ్రామాలకు శివయ్య(రవీంద్ర విజయ్) పెద్దగా వ్యవహరిస్తుంటాడు. ఆయన చెప్పిందే వేదం.. ఆయన మాటే శాసనం. అధికారం అడ్డంపెట్టుకొని శివయ్య మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడతాడు. అనాథైన దర్శి( శ్రీ తేజ) ఆయనకు రైట్ హ్యాండ్ గా పనిచేస్తుంటాడు. శివయ్య పరపతి తెలిసిన వేశ్య పుష్ఫ(అంజలి) ఆయనతో సహజీవనం చేసేందుకు పెద్దపల్లికి వస్తుంది. ఈక్రమంలోనే అనేక నాటకీయ పరిణామాల మధ్య దర్శి, పుష్పతో ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. విషయం తెలిసిన శివయ్య .. కుట్రపన్ని లక్ష్మీ(అనన్య నాగళ్ల) తో దర్శి పెళ్లి జరిపిస్తాడు. ఆతర్వాత ఏం జరిగింది? దర్శి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? దర్శిని ప్రాణంగా ప్రేమించిన పుష్ఫ జీవితం ఎటువైపు సాగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
రివైంజ్ డ్రామా కథతో బహిష్కరణ వెబ్ సిరిస్ తెరకెక్కింది. టెక్నాలజీ అంతంగా అభివృద్ధి చెందని కాలంలో గ్రామాలకు పెద్దగా వ్యవహరించేవారి నడవడిక( ప్రవర్తన) ఎలా ఉండేది? అధికారం అడ్డంపెట్టుకొని అణగారిన వర్గాల పట్ల గ్రామ పెద్దల ఎలా వ్యవహరించేవారు ? మహిళలను ఎలా హింసించేవారు ? తదితర అంశాలను బేస్ చేసుకొని ఈ వెబ్ సిరిస్ను తెరకెక్కించారు. కథ పాతదే అయినా సిరిస్‌లో ప్రజెంట్ చేసిన పాయింట్ కొత్తగా ఉంది. ఫస్ట్ ఆఫ్ పరంగా సిరిస్ బాగుంది. తండ్రి- కూతుళ్ల సెంటిమెంట్, శివయ్య- పుష్ప- దర్శి ట్రైయాంగిల్ ట్రాక్ , ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది. సెకండాఫ్ పరంగా చూసుకుంటే మాత్రం ఓకే అని చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే సన్నివేశాలకు ద్వితీయార్థంలో సమాధానం దొరుకుతుంది. స్క్రీనిప్లే సినిమాకు హైలెట్.
ఎవరెలా చేశారంటే..?
నటిగా అంజలి ఈసిరిస్ తో మరో మెట్టుఎక్కిందని చెప్పవచ్చు. వేశ్య, ప్రియురాలిగా రెండు విభిన్న పాత్రలలో నటించి మెప్పించింది. ప్రతినాయకుడి పాత్రలో రవీంద్ర విజయ్ ఆకట్టుకున్నాడు. శ్రీతేజ, అనన్య నాగళ్ల ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక పరంగా సిరిస్ బాగుంటి. దర్శకుడు చెప్పాలనుకున్నా పాయింట్ ప్రజెంట్ చేయడం అభినందించదగ్గ విషయం. సంగీతం సినిమాకు అడ్వాంటెజ్. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే కథ పాతదేనా పాయింట్ కొత్తది…
రివ్యూ; 2.75/5 (సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)