కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై(యాడ్) నిషేధం..

Telanganaelections2023: అధికార పార్టీల ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకు(యాడ్) లను నిషేధించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.ఓడిపోతామని తెలిసి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ ప్రకటనలను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అంతేకాదు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రకటనలను ఎన్నికల కమీషన్ నిషేదించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కేవలం మీడియా ఛానెళ్లలో మాత్రమే ప్రకటనలను నిషేదించడంతో “Banned” అని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రకటనలను ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది.