Telangana: నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: బండి సంజయ్

Bandisanjay: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు…రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న  మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు దీక్ష’’ చేపట్టినట్లు చెప్పారు.. ఈరోజు  కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో  రైతులతో కలిసి  బండి సంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టారు.. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి తదితరులతో కలిసి  బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారని..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందని ఆగ్రహంగా వ్యక్తం చేశారు.రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు?. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైంది?సంజయ్ ప్రశ్నించారు.