జనసేన అధినేత పవన్ తో మాజీ మంత్రి కొణతాల భేటీ..

Janasenaparty: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని కొణతాల జనసేన లో చేరే అవకాశం ఉంది. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి జనసేన తరుపున ఎంపీగా పోటీచేసే యోచనలో కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఉత్తరాంధ్రలో సీనియర్‌ నాయకుడుగా పేరున్న కొణతాల.. 1989 నుండి 1996 వరకు  అనకాపల్లి…

Read More

yssharmila: షర్మిల చీర రంగుపై చర్చ.. తలలు పట్టుకున్న వైసీపీ నేతలు..

yssharmila: మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల _ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భేటీ సరికొత్త చర్చకు దారితీసింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన సమయంలో ఆమె ధరించిన చీరరంగు విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆమె ధరించిన చీర సింబాలిక్ గా టీడీపీ రంగును పోలి ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో…

Read More

‘‘ప్రతీ చేతికి పని-ప్రతీ చేనుకు నీరు’’ … దిశగా జనసేన-టీడీపీ మ్యానిఫెస్టోను రూపొందించాలి.

‘ప్రతి చేతికి పని ` ప్రతి చేనుకు నీరు’, ‘‘వలసలు, పస్తులు లేని’’ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్టు ఇటీవల జనసేన ప్రకటించింది. దేశంలో ఎక్కడ చూసినా పోటీపడి ఉచితాలు ఇస్తామంటున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయాల్లో శుభపరిణామమే. చూడటానికి ఆరు పదాలు మాల గుచ్చినట్టు ఉన్నా దీని వెనక ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాలను నిలబెట్టే పునాది కాగలదు. అయితే…

Read More

రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?

Nancharaiah merugumala senior journalist: ” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?” కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్‌–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ  రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్‌–డిసెంబర్‌ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  పీసీసీ అధ్యక్షుడు ఎనుముల…

Read More

రాజ్యాధికారం దిశగా జనసేన అడుగులు వేయాలి…!

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు వాటి సిద్ధాంతాల్లో సారుప్యత ఉండాలి. ఇరు పార్టీలకూ ఒకే లక్ష్యం ఉండాలి. దీనికోసం ఒకే రకమైన ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలి. ఈ మూడు విషయాల్లో జనసేన, తెలుగుదేశం ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంపై (సీఎంపీ) కసరత్తు కూడా పూర్తి చేశాయి. జనవాణి, వారాహి యాత్రల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సీఎంపీలో పొందుపరచాలి. అయితే, ఈ ఉమ్మడి మేనిఫెస్టోపై సంతకం చేసి, కూటమి…

Read More

వ్యూహకర్తలకు అంత సీన్ ఉందా? గెలిపించగలరా?

ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రశాంత్‌’ పేరిట మీడియా, సోషల్‌ మీడియాలో చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటిదాక బిగ్‌బాస్‌ ‘పల్లవి ప్రశాంత్‌’ సలార్‌ డైరెక్టర్‌ ‘ప్రశాంత్‌ నీల్‌’ పేర్లు వైరల్‌ అయితే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన రాజకీయ వ్యూహకర్త ‘ప్రశాంత్‌ కిశోర్‌’ వైరల్‌ అవుతున్నారు.  గతంలో బీఆర్‌ఎస్‌కు కూడా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడో పార్టీకి సలహాలు ఇవ్వడానికి  సిద్ధమయ్యారు. నిజంగా వ్యూహకర్తలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలరా?…

Read More

వంగవీటి రంగా హత్యానంతరం తెలుగు జర్నలిస్టులకు ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి..

Nancharaiah merugumala senior journalist: ” వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్‌ తెలుగు జర్నలిస్టులకు  ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి!” బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్‌ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్‌’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా…

Read More

ఉండవల్లిని ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం!

Nancharaiah merugumala senior journalist: ఉండవల్లిని జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం! వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే మాసాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికల్లో కొందరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు నిరాకరించి, కొత్త అభ్యర్థులను నిలిపే దిశగా ఈ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆంధ్రా…

Read More

జగన్ తో షర్మిల ఢీ? ఏపి కాంగ్రెస్ కు ఆశాకిరణం..!

Appolitics :  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్‌ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్‌ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో…

Read More

Apelection: ఏపీ ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్లే కీలకం..

Apelection2024:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ పగ్గాలు ఖాయమని టీడీపీ- జనసేన కూటమి ధీమాగా ఉంది. రాష్ట్రంలోని పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటే, అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More
Optimized by Optimole