karthikamasam: ‘కార్తీకమాసం’..పాపపరిహారం కోసం ఏం చేయాలి..?

Karthikamasam2024:  కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ మాసంలో వ్రతాలు.. నోములు.. ఉపవాసాలతో పాటు దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నామని అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన అత్యంత పుణ్యదాయకమని పురాణ వచన.  విశిష్టత: కార్తీక మాసం మొదటి రోజున ఆలయాల్లో…

Read More

Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..

BhulakshmiAlayam: ‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్‌ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఎల్‌ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి…

Read More

Shravanamasam2024: శ్రావ‌ణ‌మాసంలో ఏ వ్రతాలు ఆచ‌రించాలంటే..?

Shravanamasam:  ల‌క్ష్మీ ప్ర‌ద‌మైన మాసం శ్రావ‌ణ‌మాసం. స్థితికారుడు మ‌హావిష్ణువు, ల‌క్ష్మీదేవికీ అత్యంత ప్రీతిక‌ర‌మైన మాసం.ఈమాసంలో వ్ర‌తాలు,నోములు ఆచ‌రించ‌డం వ‌ల‌న విశేష‌మైన పుణ్యంతో పాటు స‌క‌ల సౌభాగ్యాలు క‌లుగుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.చాంద్ర‌మానం ప్ర‌కారం తెలుగుమాసాల‌లో చైత్రం ల‌గాయ‌త్తు చూస్తే శ్రావ‌ణ‌మాసం. పూర్ణిమ‌నాడు చంద్రుడు శ్రావ‌ణ న‌క్ష‌త్రంలో ఉండడంతో శ్రావ‌ణ‌మాసంగా పిల‌వ‌డం ఆన‌వాయితీ. శ్రీమ‌హావిష్ణువు జ‌న్మ‌న‌క్ష‌త్రం అయిన శ్రావ‌ణ న‌క్ష‌త్రం పేరుతో ఏర్ప‌డిన ఈమాసంలో భ‌క్తిశ్రద్ధ‌ల‌తో హ‌రిని పూజిస్తే పుణ్యఫ‌లం సిద్ధిస్తుంద‌ని శాస్త్ర‌వ‌చ‌న‌. శ్రావ‌ణమాసం మ‌హిళ‌లకు ప‌విత్ర మాసం. మ‌హిళ‌లు…

Read More

RamaSetu: ఏమి సేతురా రామా..!

RamaSetu: ‘‘అంతా రామమయం…జగమంతా రామమయం..’’ అంటూ మనం నిత్యం కీర్తించే శ్రీరామచంద్రుల వారి గురించి, ఆదర్శవంతమైన ఆయన జీవిత గాథలను తెలిపే పవిత్ర గ్రంథం రామాయణానికి సంబంధించి నిజానిజాలు, ఆనవాళ్లు, ఆధారాలు, రుజువులు అంటూ ఆ దేవదేవుడు నడియాడిన పవిత్రనేలపైనే చర్చలు, వాదోపవాదాలు జరగడం సనాతన ధర్మం పుట్టినిల్లుగా పిలుచుకునే మన దేశ దౌర్భాగ్యం. ఒకవైపు విదేశీ ఆక్రమణదారుల చేతిలో బంధీ అయిన దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి పోరాడుతున్న దశలోనే, మన నాగరికతకు, చరిత్రకు సంబంధించిన కట్టడాలను…

Read More

Lordshiva: శివుడు మూడో కన్ను తెరిచినా సరే.. తప్పు తప్పే..!

విశీ(సాయివంశీ): పూర్వం మదురైని షణ్మగపాండియన్ అనే రాజు పాలిస్తున్నాడు. ఒకసారి ఉద్యానవనంలో ఉన్న సమయంలో తన భార్య జుట్టులోనుంచి సుగంధ పరిమళం ఆయన్ను తాకింది‌. కానీ ఆమె జుట్టుకు ఎటువంటి నూనె రాయలేదు. తలలో పూలు కూడా లేవు. దీంతో ‘స్త్రీ జుట్టులోనుంచి వచ్చే పరిమళం సహజమైనదా? వేరే కారణం వల్ల వస్తుందా’ అనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానం చెప్తే వెయ్యి బంగారు నాణేలు ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఇందుకోసం చాలామంది ప్రయత్నించినా ఎవరూ సరైన…

Read More

GuruPurnima:గురుపౌర్ణమి ప్రత్యేకం..గురువంటే ఎవరు?

డా . పురాణపండ వైజయంతి : గురుపౌర్ణమికి వ్యూస్ ప్రత్యేకం.. గురువంటే ఎవరు? సకల విద్యలూ నేర్పేవాడు మాత్రమేనా? అంతకు మించి ఏముంది అనుకుంటారా? దీనికి సమాధానం ఒకే పదం అదే వ్యాస భగవానుడు. జగత్తు ఎన్ని తరాలను చూసినా… ఎన్ని యుగాలను దొర్లించినా… ఏ కాలానికైనా ఆపాదించుకునేలా రచన చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. ఆ గురువు బాటను అనుసరించిన వారు శ్రీయుతులు పురాణపండ రామ్మూర్తి ఆయన జ్యేష్ఠుడు ఉషశ్రీ. వ్యాస…

Read More

Literature: స్వయంకృతాపరాధం..

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: స్వయంకృతం – – – – – – – – సీ : గర్వమెవ్వరినైన గతితప్పగాజేయు వడిజార్చి పడగొట్టు పతనమునకు, కడు అహంకారమే కడతేర్చు హోదాల కనరాని పాట్లనే కడ మిగుల్చు, దర్పమేవిధి సమ్మతము కాదు, సంపద మిడిసిపాటున దుఃఖమేను కడకు, ‘నేన’నేటి నియంత యెంతటి ఘనుడైన నాకౌట్ (Knockout) తప్పదేనాటికైన తే.గీ : యిన్ని రీతుల కాసుకొనిడుములుండ…. యేల నిశ్చింతగుండెనో యెరుకలేక! కలలొనైనను ఊహించనలవి కాని ఓటమాతడ్ని శాపమై…

Read More
కూర్మ జయంతి,రేపే కూర్మ జయంతి,కూర్మ జయంతి శుభాకాంక్షలు,కూర్మనాథ జయంతి,జూన్29న కూర్మ జయంతి రోజున ఇలా చేస్తే మీ అప్పులు తీరి డబ్బులు వస్తాయి part1,జూన్29న కూర్మ జయంతి రోజున ఇలా చేస్తే ఐశ్వర్యమే ఐశ్వర్యం part2,కూర్మ యంత్రాన్ని ఇలా పూజిస్తే 41 రోజుల్లో సొంత ఇల్లు ఖాయం,శ్రీకూర్మం చరిత్ర,జూన్ 11 శ్రీ కూర్మ జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది,విష్ణు మూర్తి,వైశాఖ పూర్ణిమ వైశిష్ట్యం,వైశాఖ పూర్ణిమ సముద్ర స్నానం,లక్ష్మీదేవి

kurmajayanthi: నేడు కూర్మ జయంతి.. విశిష్టత ఏంటో తెలుసా?

Kurma jayanthi: ️️️️️️️” మంధనాచల ధారణ హేతో .. దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో: భక్తంతే పరిపాలయమామ్ “ కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్లీర సాగరం చిలకడం   మొదలెట్టారు.  వాసుకుని తాడుగా చేసుకొని  మందరగిరిని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా.. అనుకోకుండా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగించింది.  దీంతో దిక్కుతోచని స్థితిలో దేవతలు మహావిష్ణువును శరణువేడారు. అప్పుడు నారాయణుడు కూర్మం రూపం దాల్చి మందగిరిని సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. …

Read More

SriRamaNavami: శ్రీరామనవమి వెనక ఇంత కథ ఉందా..!

Prasadrao:  దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి…

Read More

UGADI : ఉగాది పర్విదినాన ఆచరించాల్సినవి..!

Ugadi:  తెలుగు వారు జరుపుకునే అతిముఖ్యమైన పండగ ఉగాది. ఈపండుగ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మాకు అప్పగించిన శుభతరుణంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ఉగాది రోజున ఆచరించాల్సినవి;  తైలాభ్యంగనం ; తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే మహాలక్ష్మి నూనెలోనూ.. గంగాదేవి నీటిలో…

Read More
Optimized by Optimole