Illustrator: బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం..!

Charanparimi: ( Illustrater అను అనామకుడు! ) బొమ్మలేయడం కన్నా,  బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం.  ఊర్లో మానాన్న నన్ను ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగికి పరిచయం చేశాడు. ఆయన నన్ను ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. గవర్నమెంట్ జీతగాళ్ల స్టైల్లో. ఇలస్ట్రేటర్ అంటే అర్థం కాదని పత్రికలో కార్టూనిస్ట్ అన్నా. అంటే బొమ్మలు గీయటమేగా. ఇంకేదన్నా మంచి ఉద్యోగం చూసుకోకూడదు, అన్నాడు.  నాకు మోయే.. మోయే!  అప్పటిదాకా ఈ బొమ్మలు వేయడం ఒక ప్రత్యేకమైనది. చాలా గొప్పది…

Read More

Life lesson: ఆమె వివాహం.. పాతికేళ్ల విషాదం..!

విశీ( సాయి వంశీ ) : The Tragedy behind a Celebrity Marriage .. అన్ని పెళ్లిళ్లూ వేడుకలగానే మిగలవు. కొన్ని వివాహాలు విషాదాలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. అలాంటి జీవితమే నటి శాంతి విలియమ్స్‌ది. 12 ఏళ్ల వయసులో తమిళ చిత్రాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్ తల్లి పాత్ర చేసింది ఆమే! తెలుగులో అత్యంత పాపులర్…

Read More

నిజాం రాజ్యంలో మతం – ఎవరికి మేలు, ఎవరికి కీడు??

విశీ( సాయి వంశీ) : ఇత్తెహాదుల్ ముసల్మీన్ అనే సంస్థ ప్రతినిధులు ఊరి దొర, కరణాల ఎదురుగానే మాలలు, మాదిగలను ఇస్లాం మతంలోకి మార్చారు. వారికోసం దొర గోమాంస బిర్యానీ కూడా వండించాడు. ఓ దళిత మహిళ తాళి తీయడానికి ఇష్టపడక, ఈ మతం నాకొద్దని పోతూ ఉంటే దొర లోలోపల సంతోషించాడు. చివరకు తాళి మెళ్ళో ఉండగానే వారిని మతం మారేలా చేశారు ఆ సంస్థ నాయకులు. ముస్లింగా మారిన దళిత పుల్లయ్య కొన్నాళ్లకు దొర…

Read More

Razakarreview: రివ్యూ..హిందువులపై రజాకార్ల మారణహొమం.. !

Razakarreview: ‘ రజాకార్ ‘ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి  రాజకీయ పరంగా ఎన్నో విమర్శలు. ఓ  వర్గం  సినిమాను అడ్డం పెట్టుకొని మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాన ఆరోపణ. ఏదైతేనేం ఎన్నో వివాదాల కేంద్రంగా నిలిచిన ఈ మూవీ  శుక్రవారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ విముక్తి పోరాట నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన  ‘ రజాకర్ ‘ మూవీ ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల గాథను ఎలా…

Read More

Movie review: బాలల చిత్రాలు అంటేనే ఇబ్బందులు..”చిన్నారిపై చదువు బండ” …!

విశీ( సాయి వంశీ):  ✍️✍️ సినిమా గురించి చెప్పేముందు.. నేను ఎక్కువ చదువుకోలేదు. స్కూల్‌కి కూడా సెవన్త్ దాకానే వెళ్లాను. ఆ తర్వాత టెన్త్ ప్రైవేటుగా రాసి పాసై ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అదంతా ఓ ప్రహసనం. మా అమ్మానాన్నలకున్నది Minimum Education. చిన్నప్పటి నుంచి చదువు.. చదువు అని కర్ర పట్టుకుని నన్ను వెంట తరిమే పరిస్థితి లేదు. నేను బాగానే చదవడం ఓ కారణమైతే, వాళ్ల ideologyలో ‘చదవాలనిపిస్తే వాడే చదువుతాడు’ అని ఫిక్స్…

Read More

Razakar: ” రజాకార్” తర్వాత విసునూరు తీస్తారా?

విశీ ( సాయి వంశీ) : సరైన పుస్తకాలు చదవకుండా, కేవలం సినిమాలు చూసి వాటినే అసలైన చరిత్ర అని ఉద్రేకపడేది మనమే! ఈ కారణంగానే మనకు బోలెడంత మంది చారిత్రక పురుషులు, మగ స్వాతంత్ర్య సమరయోధుల సినిమాలు వచ్చాయి. వారి దృష్టికోణం ఎలా ఉంటే మనకు స్వాతంత్ర్యం అలా అర్థమైంది. We deserved it. చరిత్ర పట్ల గౌరవం, ఉత్సాహం లేక వాట్సప్‌ని మాత్రమే నమ్ముతున్న మనకు ఇలా జరగాల్సిందే! ఇప్పుడు ‘రజాకార్’ సినిమా వస్తుంది….

Read More

Astu: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికతకు అద్దం పట్టే మరాఠీ మూవీ..

విశీ( సాయివంశీ): కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి.  కథ: …

Read More

TragicLife: కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే వాక్యం నిజమైంది..!

విశీ( సాయివంశీ) :   నిండా 19 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, అందులో రౌడీలు, డాన్‌లు చేసే పనులు నచ్చాయతనికి. తానూ అలాగే అవ్వాలని అనుకున్నాడు. మెల్లగా మొదలైన అతని నేరాల పరంపర భారీ స్థాయికి చేరింది. చివరకు అతని ప్రాణాలు తీసింది. కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే బైబిలు వాక్యం నిజమైంది. 20 ఏళ్లు రాకుండానే మరణించిన ఈ యువకుడి జీవితం ఎంతోమందికి గుణపాఠం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు జీవనపాఠం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని…

Read More

కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే!

విశీ: తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్‌లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది‌. సినిమాలో నటి అర్చన దాసి కమ్లిగా…

Read More

Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?

కవన మాలి:   ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “ అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం? స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్…

Read More
Optimized by Optimole