NaaluPennungal: ‘విధేయన్’ కోసం తన్వీ ఆజ్మీ.. ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్..!

నాలుపెన్నుంగల్(నలుగురుస్త్రీలు):

తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి‌. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి Anthology Filmకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది.

కథలన్నీ స్త్రీ జీవితాల చుట్టూ అల్లుకున్నవి.1940 నుంచి 1960 మధ్య జరిగినవి. వాటిలో నటించేందుకు పద్మప్రియ, మంజు పిళ్లై, గీతూ మోహన్‌దాస్, కావ్య మాధవన్‌లను ఎంచుకున్నారు. మరొక ముఖ్యమైన పాత్ర ఉంది. నందితాదాస్ చేస్తే బాగుంటుంది. ఆదూర్ కేవలం 12 సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాల్లో దక్షిణాది హీరోయిన్లకే పెద్దపీట. రెండుసార్లు మాత్రం ఆ నియమం సడలింది. ‘విధేయన్’ సినిమా కోసం తన్వీ ఆజ్మీ, ఆ తర్వాత ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్. అంతే!

‘నాలు పెన్నుంగల్'(Naalu Pennungal) అంటే నలుగురు స్త్రీలు. ఈ కథలూ అలాగే ఉంటాయి. ఒకరు వేశ్య, ఒకరు గృహిణి, పెళ్లయినా సంసార జీవితం ఎరుగని మహిళ ఒకరు, వయసొచ్చినా పెళ్లి కాని స్త్రీ ఇంకొకరు. దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి Anthology Filmsలో ఇదీ ఒకటి. 15 ఏళ్ల క్రితం విడుదలవడం వల్ల ఎక్కువ మందికి చేరలేదు. కానీ ఇవాళ OTTలో వచ్చి ఉంటే మరింత మందికి తెలిసి ఉండేది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు స్త్రీలు. వారికి సహాయంగా ఉండే పాత్రల్ని మనోజ్.కె.జయన్, ముఖేష్, శ్రీజిత్ రవి లాంటి వారు పోషించారు. అందరిదీ మంచి Team work.

నాలుగు భిన్న నేపథ్యాలు కలిగిన స్త్రీలు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు కథలుగా మలిచిన విధానం చెప్పడం కన్నా చూడటమే బాగుంటుంది. ముఖ్యంగా కావ్య మాధవన్, నందితాదాస్ నటించిన కథ గుర్తుండిపోతుంది. ఈ సినిమా చాన్నాళ్లు YouTubeలో English Subtitlesతో అందుబాటులో ఉండేది. ఇప్పుడు Subtitles లేవు. ఈ సినిమా OTTలో ఉందో లేదో తెలియదు. దొరికితే మాత్రం తప్పకుండా చూడండి. Direction and Actingకి సంబంధించి One of the Finest Indian Classics ఈ సినిమా.