APpolitics: ‘వై నాట్ 175’ ఎవరి నినాదమయ్యేనో!
APpolitics: వై నాట్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి? ఉన్నట్టుండి ఓ నినాదం శిబిరం మారిస్తే ఎలా ఉంటుంది? రాత్రికి రాత్రి నాయకులు శిబిరాలు మారుస్తున్న రాజకీయ వాతావరణంలో ఉన్నాం! నాయకుల సంగతలా ఉంచి…. నిన్నటి దాకా ఒక శిబిరంలో ఘాటుగా చలామణి అయిన ఓ నినాదం ప్రత్యర్థి శిబిరానికి మారి, అక్కడ చర్చనీయాంశమౌతున్న పరిస్థితి! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ‘వై నాట్ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయంలో ‘వై నాట్’ కోణంలోనే విశ్లేషణలు…