Hyderabad: ఏ తల్లయినా తన పిల్లలను తానే చంపుకుంటుందా? జీహెచ్ఎంసీ అలాంటి పనే చేసింది! రామంతాపూర్ లో రోజూ 300 మంది ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్ ని సీజ్ చేసింది. కారణం ఏంటో తెలుసా? విస్తార్లతో పక్కనే చెత్త పేరుకుపోతోందని!! రోజూ అన్నం తిన్న తర్వాత విస్తార్లను పక్కనే పాలిథిన్ సంచిలో ప్యాక్ చేస్తారు. కానీ, రాత్రిపూట కుక్కలు ఆ సంచిని చింపేస్తుండటంతో పొద్దున్నే చెత్త పేరుకుపోతోంది. దీంతో పారిశుధ్య కార్మికులకు ఆ చెత్తను తొలగించడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం జీహెచ్ఎంసీ అధికారులే ఆలోచించాలి, అమలు చేయాలి. చెత్తను తొలగించే దారులు వెతకకుండా, అన్నం పెట్టే దారిని మూయడం ఎంత వరకు సమంజసం అని స్థానికులు వాపోతున్నారు. నిరుపేదల ఆకలి తీర్చే, ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న 5 రూపాయిల భోజనం క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు.