Telangana: విద్యా సంస్థలలో ‘ఈ’ ఆఫీసు ఆవశ్యకత..!
Telangana: మన తెలంగాణ రాష్ట్రం ఐ.టి. రంగంలో అగ్రగామిగా పేరు గడించింది. ఐ.టి. రంగంలో దేశంలో తలమానికంగా ఎదుగుతున్నది. కోట్లాది రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను చేస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. భాగ్యనగర కాంతులను విరజిమ్ముతుంది. ఐతే కాంతి రేఖలు నగరాల నుండి అనేక రంగాలకు వెదజల్లాలి అప్పుడే ఆధునిక సాంకేతికత దన్నుతో నూతన జవసత్వాలతో ప్రగతి పతాక ఎగురుతుంది. ఐ.టి.. విద్యారంగంలో వెలుగులు పూయించాలి. ఇప్పటి అనేక ఆఫీసుల్లో ముఖ్యంగా విద్యారంగంలో రాతపూతల పని…