హైకోర్టు ఆదేశాలతో సంజయ్ విడుదల!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. కేంద్ర మంత్రి భగవత్ కుభాతో పాటు బీజేపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. టీఆర్ఎస్‌పై ధర్మ యుద్ధం చేస్తానని, కేసీఆర్‌ను జైలుకు పంపేవరకూ వదలిపెట్టనని శపథం చేశారు సంజయ్‌. కరీంనగర్ పోలీసులు సీఎంఓ డైరెక్షన్లో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. జీవో 317 విషయంలో వెనుకడుగు…

Read More

పంజాబ్ ప్రధాని పర్యటన రద్దుపై దుమారం!

పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలు తలెత్తడం తీవ్ర దుమారానికి తెరతీసింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన అర్ధంతరంగా రద్దు కావడం రాజకీయ దుమారానికి తెరతీసింది. పర్యటనలో భాగంగా బఠిండా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన ప్రధాని…..అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్‌ జిల్లా హుస్సెనివాలాలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థూపం దగ్గర నివాళులర్పించేందుకు…

Read More

దేశంలో దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్!

దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి 892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్‌ కేసులతో టాప్‌ టూలో ఉన్నాయి. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే…..

Read More

కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు

తెలంగాణలో బండి సంజయ్‌ అరెస్ట్‌ను మైలేజ్‌గా తీసుకున్న కమలనాధులు… కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో ఉన్న బండి సంజయ్‌ను… కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు నేతలు ములాఖత్‌ త్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. ఘటన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. అటు ఎంపీగా తన హక్కులకు భంగం…

Read More

బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా నిబంధన‌ల‌కు అనుగుణంగా జాగ‌రణ చేస్తుంటే.. పోలీసుల‌కు, ప్రభుత్వంకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ…

Read More

స్టాండప్‌ కమిడియన్‌ కు బీజేపీ నేతల హెచ్చరిక!

వివాదాస్పద స్టాండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ తెలంగాణ టూర్‌ పై హిందూసంఘాలు భగ్గుమంటున్నాయి. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. రాష్ట్రంలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. తెలంగాణ సర్కార్‌పై ఫైర్‌ అవుతున్నాయి. అతనిపై.. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేదం విధించాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎట్టిపరిస్థితిలోనూ హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చిరిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో జనవరి 9న షో నిర్వహిస్తున్నానని వారం క్రితం మునావర్‌ ఫరుఖీ ప్రకటించారు. దీన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్‌.. మునావర్‌తో పాటు…

Read More

కేంద్రం సాగు చట్టాలను మళ్ళీ తీసుకురానుందా?

వ్యవసాయ రంగంలో సంస్కరణలోభాగంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను.. మోదీ సర్కార్‌ మళ్లీ తీసుకురానుందా? రైతుల అభ్యతంరాలతో ఒక అడుగు వెనక్కి తగ్గామే తప్ప! మళ్లీ తీసుకొచ్చే అవకాశముందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యల్లో వాస్తమెంత? దేశవ్యాప్తంగా దూమారం రేపిన సాగు చట్టాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా మహరాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై.. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. 74 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌ అత్యద్భుతమైన…

Read More

సినిమా టికెట్స్ రేట్లపై నాని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..

నటుడు నాని వ్యాఖ్యలతో ఏపీలో సినిమా టికెట్ల రగడ మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓఛానల్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టుకి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి నుంచి ట్వీట్ల ద్వారా రిక్వెస్టులు పంపడం తప్ప.. ఈ విధంగా నిరసన తెలిపిన వారు లేరు. నాని విజిల్ బౌలర్ పాత్ర పోషించడంతో ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు….

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. తెలంగాణలోను వణికిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల సంఖ్య 38కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంక్రాంతి వేడుకల్లోనూ…

Read More

అమ్మవారి విశ్వ విద్యాలయంలో అన్యమతస్తుల వేడుక!

అది హిందూవుల కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్నచోటు. ఆదగ్గర్లోనే పద్మావతి అమ్మవారి పేరిట నడుస్తున్న విశ్వవిద్యాలయం. అక్కడ అన్యమతస్తుల వేడుకల నిషేదం అమల్లో ఉంది. అయితే తాజాగా.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తుల వేడుకను అధికారుల సమక్షంలోనే అట్టహసంగా జరిపారు. దీంతో హిందూసంఘాల నేతలు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అన్యమతస్తుల వేడుకలు నిషేదం అమల్లో ఉంటే.. వేడుకలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా సాక్ష్యాత్తు పద్మావతి అమ్మవారి పేరుతో నడుస్తున్న మహిళ విశ్వవిద్యాలయంలో.. నిబంధనలకు విరుద్ధంగా…

Read More
Optimized by Optimole