ఐపీఎల్ 20 21 సెకండ్ షెడ్యూల్ కి అంతా సిద్ధం!!
కరోనా మహమ్మారి కారణంగా అర్దాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ 2021 మిగతా మ్యాచ్ల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది. ఇందుకోసం బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ సహా ఇతర అధికారులు ఇప్పటికే కీలక చర్చలు జరిపారు. బీసీసీఐ అడిగిన ప్రతీ అంశానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. 25 రోజుల్లోనే 31 మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ…