News
తాత్కాలిక సిబ్బందిని నియమించండి : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పోరు మొదటి శ్రేణి యోధులైన వైద్య ఆరోగ్య సిబ్బంది పై ఒత్తిడి తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా ఈ రెండు మూడు నెలల కోసం, వైద్యుల, 50 వేల తాత్కాలిక సిబ్బందిని నియమించాలని వైద్య శాఖ కు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులుపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత, రెసిడెమివర్ ఇంజక్షన్స్, పడకలు…
కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు!
కోవిడ్ చికిత్స కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ , కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.తాజా మార్గదర్శకాలు ప్రకారం ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడానికి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కోవిడ్ ఉన్న లేకపోయిన ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స అందించాలని పేర్కొంది. కోవిడ్ బాధితులకు సత్వర చికిత్స అందించడమే తమ ధ్యేయమని ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు: – కోవిడ్ పాజిటివ్…
బెస్ట్ సీఎంగా నవీన్ పట్నాయక్!
దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిలిచారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్టాల ముఖ్యమంత్రుల పనితీరు గురించి ముంబైకి చెందిన ఆర్మాక్స్ మీడియా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో నవీన్ పట్నాయక్ 57 శాతం రేటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. ఏపీ సీఎం జగన్ 55 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ 44 శాతంలో 15 వ స్థానంలో.. కేరళ సీఎం పినరయి విజయన్, అస్సాం…
ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక !
ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగొచ్చారు. కాగా ఇదే జట్టును జూన్లో న్యూజిలాండ్ తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కొనసాగించనున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత…
తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్
కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై వస్తున్న ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వలన జనజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకులే ప్రమాదముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు, పడకలు వంటి విషయాలపై చర్చించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను…
‘పంత్’ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ !
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాకింగ్స్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ సత్తా చాటాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(747 పాయింట్లతో)పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని కెరీర్లో ఇది ఉత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇకపోతే భారత ఆటగాళ్ళలో కెప్టెన్ కోహ్లీ (814 పాయింట్లతో) ఐదో స్థానాన్ని నిలిచాడు. కాగా రిషబ్ పంత్ తో పాటు హెన్రీ నికోలస్, రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు….
లాక్‌డౌన్ ఆలోచన లేదు : సీఎస్
తెలంగాణలో లాక్‌డౌన్ వలన ఎలాంటి ఉపయెగం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అవసరాలను బట్టి లాక్ డౌన్ పై తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచించిన వారంతపు లాక్ డౌన్ అంశంపై పరీశీలిస్తామన్నారు. ప్రజలు కరోనా గురించి భయపడాల్సిన అవసరంలేదని, పరిస్థితి అదుపులో ఉందని.. లాక్డౌన్ వలన ప్రజల జీవనోపాధి దెబ్బతింటుదని సీఎస్ వెల్లడించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని…
ఐపీఎల్ వాయిదా!
ఐపీఎల్ తాజా సీజన్లో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికార ప్రకటన చేసింది. ఆటగాళ్ళ భద్రత కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్( గాలి బుడగ) ఫెయిల్ కావడం టోర్నీ వాయిదాకు ముఖ్య కారణంగా తెల్సుతుంది. ఓ వైపు దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో టోర్నీ దుబాయ్ కి షిఫ్ట్ చేయలని వార్తలు వచ్చిన.. స్వదేశంలోనే టోర్నీ నిర్వహిస్తామని తెలిపిన బోర్డు.. పలు…
అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది: ఖుష్బూ
బీజేపీ పై విమర్శలు చేసిన వారికి నటి కుష్బూ తనిదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకొని వికసించదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించలేదంటూ విమర్శలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఖాతా తెరవని పార్టీ, ఈసారి నాలుగు స్థానాలు గెలుచుకుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, రానున్న రోజుల్లో అధికారంలోకి కమలం పార్టీ రావడం ఖాయమని…