ఎవరి గోల వారిదే…
ఐ.వి.మురళీ కృష్ణ శర్మ(రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ): తెలంగాణాలో నాలుగు నెలల్లో జరగనున్న మూడవ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని పార్టీలు వ్యూహరచనలలో తనముకలయ్యాయి. ఎవరికివారే ఎదుటువారిని దెబ్బకొట్టేలా ఎత్తుగడలు వేస్తుండడంతో రాష్ట్రంలో అయోమయం రాజకీయ వాతావరణం నెలకొంది. బడాబడా హామీలతోపాటు ఎదుటి పక్షాలపై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. తమ అభ్యర్థులు సరైన పోటీ ఇవ్వగలరో లేదో సంశయంతో ఇతర పార్టీల నేతలను అక్కున చేర్చుకుంటున్నారు. నేడు ఒక పార్టీలో ఉన్న వారు తెల్లారేసరికి ఎవరి పంచన…