రైతులకు అండగా జనసేన నిలుస్తుంది: నాదెండ్ల మనోహర్
Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి రైతులు ఆవేదనలో ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విఫలమైందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నీట మునిగిన పంటను చూసి బాధలో ఉన్న రైతు తమ ఆవేదనను పంచుకొనే అవకాశం లేకుండా ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. మీడియా ముందుగానీ, ప్రతిపక్షాల దగ్గరగానీ మాట్లాడితే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తున్న దాఖలాలు మా…