అవకాశం అదే .. అగ్ని పరీక్షా అదే!
నారా లోకేష్‌లో పరివర్తన నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెనుకుదుపే! తండ్రి చాటు బిడ్డ అని ముద్రపడ్డ లోకేష్ రాజకీయంగా తననుతాను నిరూపించుకోవడానికి ‘యువగళం’ పాదయాత్ర ఎంతటి అగ్నిపరీక్షో అంతకుమించి అరుదైన అవకాశం. దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్ మసకబారి, బిజెపి మొగ్గవిచ్చని స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా … ఎ.పి.లో పాలక వై.ఎస్.ఆర్.సి.పి ని ధీటుగా ఎదుర్కోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చే చంద్రబాబు రాజకీయ వారసుడిగా నిరూపించుకోవడమా? దారి…