వైసీపీలో తిరుగుబాటు మొదలైంది : ఎంపీ రఘురామ

వైసీపీలో తిరుగుబాటు మొదలయ్యిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. తిరుగుబాటు అనేది అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అయితే ..ఆత్మాభిమానానికి ప్రతీక తానన్నారు. జగన్ పాలన పై ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు ఓపిక నశించి.. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారని రఘురామ స్పష్టం చేశారు. దమ్ముంటే సీఎం జగన్..ఆనం, కోటంరెడ్డి లపై అనర్హత వేటు వేయాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…

Read More

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read More

మాదకద్రవ్యాల కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్: రఘురామ

మాదకద్రవ్యాలకట్టడిలో  ఆంధ్ర ప్రదేశ్ విఫలమైందన్నారు నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు.  మాదకద్రవ్యాలకు  రాష్ట్రం అడ్డాగా మారిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందయన్నారు. ఈ విషయంపై  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. వారిద్దరి  భేటీ  కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్టు  తనకు సమాచారం ఉందన్నారు. ఇక ఈ అంశంపై … సాక్షి దినపత్రికలో సడలని పట్టు అన్న శీర్షికతో వార్తా కథనం రాశారని  ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లపాటు సడలని…

Read More

నెగ్గేదెవరు..? తగ్గేదెవరు..?

తెలంగాణలో తొమ్మిదియేండ్లుగా కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి దూరం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీకి 130 సంవత్సరాల సుదీర్ఘ  చరిత ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్ర భాతర దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ దక్కింది. నాటి ఇందిరమ్మ కాలం నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వరకు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అంటే అభిమానం చూపించారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో నేడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల…

Read More

సామాజిక పింఛన్లను తొలగించడం హేయం: జనసేనాని

ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు  కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య  పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు  చూపించిన కారణాలు సహేతుకంగా లేవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పింఛన్ల…

Read More

స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం: రఘురామ

స్మార్ట్ మీటర్ల కోసం జగన్ ప్రభుత్వం.. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. స్మార్ట్ మీటర్ల సరఫరా పేరుతో  తమకు కావలసిన వారికి వేల కోట్ల రూపాయలను కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దండుకుంట ఆదాయం సమకూరే విధంగా చూస్తామంటే కుదరదన్నారు. గతంలో అవినీతికి పేరుగాంచిన తమిళనాడులో మూడువేల రూపాయలకే  స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని..రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ధర 36…

Read More

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుసుకునేందుకు ‘తటస్థుల దీవెన’ పేరుతో మరో యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్రంలోనే నాంది పలికిన శ్రీధర్ రెడ్డి.. ఈ యాత్రతో ప్రజలకు మరింత చేరువకానున్నారు.జనవరి మూడు నుంచి సుమారు 30 రోజులపాటు జరగనున్న పాదయాత్రకు రోట్ మ్యాప్ సైతం రెడీ అయ్యింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ,గ్రామీణ ప్రాంతాల్లో యాత్ర సాగనుండగా..డాక్టర్లు,…

Read More

కాపులు ఎవరు? వారి జనసంఖ్య ఎంత? ‘రాజ్యాధికారం’ ఎప్పుడొస్తుంది?

Nancharaiah merugumala:(senior journalist) కాపులు ఎవరు? కాపు, బలిజ, తెలగ, ఒంటరి (కేబీటీఓ) సముదాయం జనం ఎంత మంది? కాపులకు ఇప్పుడు అసలు ‘రాజ్యాధికారమే’ లేదా? కాపు సంస్కృతి అనేది ఉందా? ఈ విషయాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (USA) చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) లేదా మసాచూసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణులతో అధ్యయనం చేయిస్తే బావుంటుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ఎవరైనా ఈ సలహా…

Read More

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్..

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు  సంబంధించి పార్లమెంట్  బులిటెన్ విడుదల చేసింది.   ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన   8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ” రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ ” మంజూరు చేసిందని గుర్తు చేశారు. బోర్డు ద్వారా  30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి పార్లమెంట్ ఆమోదించిందని.. 1986…

Read More

టీఆర్ఎస్ నేతలే ఓట్లేసుకుంటున్నారు… ఫలితాలు ప్రకటించుకుంటున్నారు: సంజయ్

సెస్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారు మారు చేస్తారా? అంటూ ద్వజమెత్తారు. సెస్ ను నాశనం చేసిన టీఆర్ఎస్ కు ఓట్లేయలేదేనే అక్కసుతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తారాని?  సంజయ్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలే ఓట్లేసుకుంటున్నారు… వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారని.. ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు? అని…

Read More
Optimized by Optimole