చక్రవ్యూహంలో విజేతలు ఎవరు..?

వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఓ ఇంటర్వ్యూలో మీరు సీఎం అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అన్నారు ఒక జర్నలిస్ట్ ఆయన నవ్వుతూ “నాకు ఈగో అనే ఒక నరం ఉండేది ఆ నరాన్ని కట్ చేసుకున్న తర్వాత సునాయాసంగా సీఎం అయ్యాను అన్నాడు”   ఎన్నికలు అంటేనే ఒక రాజకీయ వ్యూహం ఉండాలి. పద్మావ్యూహం లా ఎప్పటికి అప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతూ సక్సెస్ అవ్వాలి. నాయకుడు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి….

Read More

డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పరుగులు : పవన్ కళ్యాణ్

telanganaelections2023: ‘అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్దించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంద”ని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ జిల్లా, తాండూరు…

Read More

రైతు బంధుకు వచ్చిన అనుమతి…మిగతా బంధులకు ఎందుకు రాలేదు : రేవంత్

telanganaelections2023: రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు? ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “రైతు బంధు…

Read More

పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దు :రేవంత్ రెడ్డి

telanganaelections2023: ఉద్యమ సమయంలో పదవులను పూచిక పుల్లలా విసిరేశామని కేసీఆర్ చెబుతున్నాడని.. నిజానికి పదవులు విసిరినట్లే విసిరి.. ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలెక్షన్ల పేరుతో ఆస్తులను దోచుకున్నారని, రాజీనామా తర్వాత కూడా పదవులు వారే తీసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యమం కోసం తన మంత్రి పదవిని విసిరేసి.. తిరిగి ఆ పదవికి తీసుకోలేదన్నారు. పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారే వాళ్లకు…

Read More

తెలుగు రాష్ట్రాల యువత భవిష్యత్తు బంగారం కావాలి: పవన్ కళ్యాణ్

Telanganaelections: ‘ తాను ఏనాడూ పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన- బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాకలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం తాను ఏ నాడూ అర్రులు చాచలేదన్నారు. అధికారం, పదవులు మాత్రమే ఆఖరి లక్ష్యం అయితే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేసుకునేవాడినని..అక్కడే ఉండిపోయేవాడినని స్పష్టం…

Read More

సీసలొద్దు… పైసలొద్దు… మిర్చి నుంచి కొత్త ర్యాప్ సాంగ్..!

Radiomirchi: ఎంటర్టైన్ మెంట్ కి, సృజనాత్మక కార్యక్రమాలకు చిరునామా అయిన 98.3 రేడియో మిర్చి తెలుగు స్టేషన్, ఎన్నికల వేళ యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ‘సీసలొద్దు పైసలొద్దు’ అనే ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది. చిన్న చిన్న పదాలతో రాసిన ఈ పాట, అందరికీ అర్థమయ్యే విధంగా ఓటుకు ఉన్న శక్తిని, దానిని వృథా చేయడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తుంది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజాస్వామికవేత్త డాక్టర్ జయప్రకాశ్ నారాయణ…

Read More

నేనూ కాపోడినే: సీఎం కేసీఆర్

Nancharaiah merugumala senior journalist:    “నేనూ కాపొడినే..   కరీంనగర్ లో కేసీఆర్ వెల్లడిసకల కాపు సోదరసోదరీమణులకూ చల్లని మాటిది” ‘నేనూ కాపోడినే,’ అని సోమవారం కరీంనగరు ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మున్నూరు కాపు మంత్రి గంగుల కమలాకర్ గెలుపు కోసం బీఆరెస్ అధినేత ప్రచారం చేస్తూ, ‘ నేనూ కాపోడినే. నేనూ వ్యవసాయం చేస్తన్నా. కాపోడిగా రైతు కష్టం నాకు తెల్సు,’ అని తెలంగాణ సీఎం బహిరంగంగా ప్రకటించడం…

Read More

భారీ మెజార్టీతో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి: పవన్ కళ్యాణ్

Telanganaelection2023: ఆంధ్రలో రౌడీలు రాజ్యాలేలుతున్నారని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.రౌడీలను, గూండాలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొని నిలబడి ఉన్నానంటే దానికి ముఖ్య కారణం తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తేనని ఆయన స్పష్టం చేశారు.ధన బలం లేకపోయినా గుండె ధైర్యం, ఆశయ బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఈ నేల నేర్పిందన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతి, కమీషన్ల తెలంగాణగా మారిపోవడం చూసి బాధ కలిగింద”ని జనసేనాని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్ర నాకు జన్మనిస్తే…

Read More

80 స్థానాలకు ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం: టీపీసీసీ రేవంత్ రెడ్డి

Telanganaelections2023:తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి  80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుంది.మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు…కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతుండు. నిజామాబాద్ సాక్షిగా  కేసీఆర్ కు చెబుతున్నా..80 సీట్ల కంటే ఒక్క…

Read More

కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలి: నాదెండ్ల మనోహర్

Telangana election2023: కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి  ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.  మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో  ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం  చేయాలని సూచించారు….

Read More
Optimized by Optimole