ప్రీపోల్ సర్వే రిపోర్ట్ ఎక్స్ క్లూసివ్ .. తెలంగాణ ఆ పార్టీదే..!

telanganaelectionsurvey: తెలంగాణలో ఏ ముగ్గురు కలిసిన ఒకటే చర్చ! ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రధాన మీడియా సంస్థలతో పాటు పలు సర్వే సంస్థలు ప్రజానాడీ ఎలా ఉండబోతోందన్న అంశంపై అనేక సర్వేలు నిర్వహించాయి. సర్వే ఫలితాలను కూడా వెల్లడించాయి. తాజాగా మా సంస్ధ సైతం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నిర్వహించింది. ప్రీ – పోల్ ఫలితాలను వెల్లడించింది.ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేనట్లు తేలింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా తెలంగాణలో హాంగ్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది.

కాగా తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడేకొద్ది పార్టీలపై ప్రజల్లో అభిప్రాయం మారిపోతోంది. అనూహ్యంగా కాంగ్రెస్- బీజేపీ గ్రాఫ్ లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఏం జరుగుతుందా? అన్న చర్చ రాజకీయ పార్టీల్లో నడుస్తోంది.

Optimized by Optimole