చక్రవ్యూహంలో విజేతలు ఎవరు..?

వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఓ ఇంటర్వ్యూలో మీరు సీఎం అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అన్నారు ఒక జర్నలిస్ట్ ఆయన నవ్వుతూ “నాకు ఈగో అనే ఒక నరం ఉండేది ఆ నరాన్ని కట్ చేసుకున్న తర్వాత సునాయాసంగా సీఎం అయ్యాను అన్నాడు”

  ఎన్నికలు అంటేనే ఒక రాజకీయ వ్యూహం ఉండాలి. పద్మావ్యూహం లా ఎప్పటికి అప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతూ సక్సెస్ అవ్వాలి. నాయకుడు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గ్రౌండ్ లెవల్ లో తప్పు ఒప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. తనకు నియోజకవర్గం ప్రజల్లో పాజిటివ్ వేవ్ నడుస్తుంది ఆ వేవ్ లో నేను గెలుస్తాను  అనుకుంటే ఇంకా తన మెదడుకి ఎక్కువ పనిచెప్పి ఓట్ల వేటలో ఉండాలి. నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది ఆ డబ్బుతో విజయం నా ఇంటి గుమ్మ ముందు ఉంటుంది అనే భ్రమలో ఉంటున్నారు చాలామంది నాయకులు. అయితే ఆ భ్రమతో అసలు చివరి క్షణాల్లో ఓటర్లతో ఉండాల్సిన రీతిలో ఉండకుండా  లైట్ తీసుకుంటారు. మన కళ్ళ ముందు ఒక మైనస్ కనపడుతున్న లైట్ తీసుకొని తరువాత భాద పడతారు. నాయకుడి కి ఈ టైం లో ఓపిక అవసరం ప్రతి ఓటు అవసరం. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా లో అంత సీనియర్లు పోటీలో ఉన్నారు. మొదటిసారి తప్ప మిగతాసారి అభ్యర్థి పోటీలో ఉంటే డబ్బు, అధికారం, ఫాలోవర్స్ ఇవన్నీ ఒకటైతే అభ్యర్థి వ్యక్తిత్వం అనేది చాలా కీలకం. మొదటిసారి పోటీలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సీఎం కాండేట్, గ్రౌండ్ లెవెల్ ఉన్న పరిస్థితులు చూస్తారేమో కానీ రెండొవసారి నుండి పోటీలో ఉంటే కచ్చితంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రజలు చర్చించుకుంటారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లా లో పోటీలో ఉన్నవారు సీనియర్స్ కావడంతో టోటల్ గా మనవైపే ఉన్నారు ప్రజలు గెలిచాము అనే ఊహించుకుంటున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ పవర్ లో ఉన్నారు కాబట్టి ఓ కోటరీ పక్కన చేరి భజన చేస్తుంది.

“కుందేలు తాబేలు కథ గుర్తు ఉంది కదా!”ఆ కథని మరోసారి గుర్తు తెచ్చుకోవాలి అభ్యర్థులు కొంతమంది అప్పుడే గెలిచాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కీలక పదవిలో ఉన్నామని అనుకుంటున్నారు. ఇంకా ఓటింగ్ ప్రక్రియ దగ్గర పడుతుంటే కామన్ గా _అభ్యర్థి దగ్గరికి వచ్చిన వారు 90%  వాళ్లకు తెలిసిన రియాల్టీని చెప్పడానికి కొంత భయపడతారు లేదా నాకెందుకులే అనుకుంటారు_’  సార్ మీరు సూపర్ కచ్చితంగా మనమే గెలుస్తున్నాం అంటారు తప్ప వాళ్ళకున్న మైనస్ పాయింట్స్, సరి చేసుకోవలసిన అంశాలు ప్రస్తావన తెస్తే ఎక్కడ నేను దూరమైపోతానో అని వచ్చిన వ్యక్తి అనుకుంటాడు!’..వాస్తవానికి నెగిటివ్ అంశాలని ప్రస్తావిస్తే జీర్ణించుకోలేని పరిస్థితులలో నాయకులు ఉన్నారు. ఈ ఒక్క అంశమే వాళ్ళ కొంపను కొల్లేరు చేస్తుంది. వాస్తవానికి మన లోటుపాట్లను ఎత్తిచూపేవారి విషయాలను పరిగణలోకి తీసుకొని ఎందుకు అని వారు అలా చెబుతున్నారు అని విశ్లేషించుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా మనని ఆకాశానికి ఎత్తుతున్నారు అంటే నిమర్జనం తప్పదు అనే అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక అసలు విషయానికి వద్దాం అభ్యర్థి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి గెలుస్తాము అనుకుంటే ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత ఇబ్బంది ఉంది అనుకుంటే గాబరా కాకుండా తన మెదడుకి పని చెప్పి ఎక్కడ తనకు మైనస్ అవుతుందో అక్కడ పోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఆలాగే తనకు అనుకూలంగా ఉన్నా చోట ఇంకా ఎక్కువ ఓట్లు రాబట్టుకోవాలి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి పై పోకస్ చేయాలి వాళ్లకు ఒక ఇంచార్జ్ ని పెట్టాలి ఓటు రూపంలో తనకు అనుకూలంగా మార్చుకోవాలి. వాళ్లు అనుకున్న ఓట్లు పోలింగ్ బూత్ వరకు పోయి వాళ్లకు అనుకూలంగా పడే వరకు వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకునే పరిస్థితి ఉండాలి. ఇది అభ్యర్థి తో పాటు ఆయన చుట్టుపక్కల వాళ్ళు నేనే అభ్యర్థిని అనుకుని వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు అవునన్నా కాదన్న ఈ ఎన్నికల్లో డబ్బే ప్రభావితం చేస్తుంది .. చివరి రోజు డబ్బు పంచితే కచ్చితంగా మాకు ఓట్లు వస్తాయని లెక్కల్లో ఉన్నా నాయకులు డబ్బుతో పాటు ఆ ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు అక్కడ వ్యక్తి క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమే. ఓట్లకు అడిగే క్రమంలో మేము సీనియర్ అని కాకుండా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం మాకు అవకాశం ఇవ్వండి అన్నట్లుని వ్యవహరించాలి. లేదు మేము గెలుస్తున్నాం అని వాపు చూసి బలుపు అనుకుంటే పాతాళంలోకి పోవడం ఖాయం. 

నోట్ :- డబ్బు, మధ్యం కాకుండా వ్యక్తిత్వాన్ని, అభివృద్ధిని నమ్ముకోండి సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వచ్చే విధంగా ప్రోత్సహించండి. ప్రజలతో, సెకండ్ క్యాడర్ లీడర్లతో  ప్రతి నాయకుడికి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండాలి ఇప్పుడు ఆర్థిక సంబంధాలు తప్ప అనుబంధాలు లేవు..

============

శేఖర్ కంభంపాటి( సీనియర్ జర్నలిస్ట్):